పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం... | funday song special | Sakshi
Sakshi News home page

పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం...

Published Sat, Aug 27 2016 11:58 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం... - Sakshi

పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం...

పాటతత్వం
 
‘‘అన్యాయం జరిగినప్పుడు..
ఆందోళనకు గురైనప్పుడు...
ఆపదలో చిక్కుకున్నప్పుడు..
మనకు అర్జంటుగా గుర్తొచ్చేది పోలీసులే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరికీ కొండంత అండగా మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చే పోలీసుల్లో జోష్ నింపే పాట ఇది. వాళ్లలో హుషారు నింపడంతో పాటు మనందరిలో పోలీసులపై సదభిప్రాయాన్ని తీసుకొస్తుందీ పాట. నిజంగా పోలీసుల కష్టాన్ని చూస్తే ‘సలాం’ కొట్టకుండా ఉండలేమండీ’’ అన్నారు గాయకుడు సింహా. గోపీచంద్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గోలీమార్’. చక్రి సంగీతమందించిన ఈ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘సలాం పోలీస్..’ పాటను సింహా ఆలపించారు. ఈ పాటతత్వం గురించి సింహా మాటల్లో...
 
వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా భాస్కరభట్లగారు ఈ పాటను రాసిన విధానం, చక్రిగారి సంగీతం సింప్లీ సూపర్బ్. చిన్నప్పట్నుంచీ పోలీస్ కావాలని కలలు కనే ఓ యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్న సందర్భమది. అప్పుడు పోలీస్ అయితే తానేం చేస్తాడో చెబుతూ, పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ పాట పాడతాడు. నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన, నేను పాడిన అత్యుత్తమ పాటల్లో ఇదొకటి.
 
ఖాకీ చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను
తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా..
కష్టాలైనా కన్నీళ్లైనా నీ యెనకాలే ఉండేవాడు
నీడై నీతో వచ్చేవాడు పోలీసోడేరా
నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే
నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే
ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోణ్ణేలే ॥ఖాకీ॥

కష్టాలు.. కన్నీళ్లు.. మనం ఎంత ఆపదలో ఉన్నప్పటికీ, కాదనకుండా నీడల్లే మనతో వచ్చేది, మన వెనక వచ్చేది పోలీసులే. ఎక్కడైనా ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్, అగ్ని ప్రమాదాలు, విపత్తులు, మరోకటో సంభవించినప్పుడు ఉరుకుల పరుగులతో కాపాడడానికి వచ్చేది ఎవరండీ.. పోలీసులే కదా. అందుకే, దేవుడా.. నువ్వే దిక్కు నన్ను రక్షించాలని వేడుకుంటే పోలీసుల రూపంలో భగవంతుడు వస్తాడని, ‘ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోణ్ణేలే’ అని చెప్పారీ పల్లవిలో.
 
తలపై టోపీ అంటున్నాది ఎనకడుగు వద్దంటూ రైళ్లూ బస్సులు తగలేస్తుంటే లోపల తోయంటూచుట్టం గిట్టం తెలవదు నాకు మంచోళ్లంతా చుట్టాలే భయ్యమ్ గియ్యమ్ జాన్తా నైరే ఆడెవడైనా తొక్కాలే పోలీసోడే లేని ఊరే లేదే.. వాడే లేడా ఊరు వల్లాకాడే ॥ఖాకీ॥ నిరసనకారులు తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడానికి బస్సులు, రైళ్లు తగలబెడుతుంటారు. అవి మన ప్రభుత్వ ఆస్తులే. అంటే ప్రజల ఆస్తులే. దీనివల్ల నష్టం ఎవరికి? మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తులను లోపల (జైల్లో) తోయడంలో తప్పేముంది. తప్పు చేసింది ఎవరైనా పోలీసులు భయపడరు. వాళ్లను లోపల తోసేయడమే. మంచి చేసినోడికి పోలీసోడు చుట్టం, చెడు చేసినోడికి చట్టం చేతిలో శిక్ష ఖాయం. ప్రజలకు ఇబ్బంది కలిగిన ప్రతి సందర్భంలోనూ పోలీసులు ప్రత్యక్షమవుతారు. సవాలక్ష ఒత్తిళ్ల మధ్య సమయానికి తగు రీతిలో స్పందించడం ఒక్కో సందర్భంలో ఆలస్యం కావొచ్చు. కానీ, అసలు పోలీసు రక్షణ లేని ఊరిని ఊహించుకోగలమా? అరాచక శక్తులు రాజ్యం ఏలుతాయి.

వదలకు బ్రదరూ అంటున్నాది బిగిసిన ఈ బెల్టు అమ్మాయిలపై యాసిడ్ పోస్తే తాటే తీయంటూ  తిండి నిద్ర గుర్తే రావు డ్యూటీలోకి దిగిపోతే
 ఇంకో జన్మే ఉన్నాదంటే మళ్లీ అవుతా పోలీసే  రాత్రయిపోతే సూర్యుడు వెళిపోతాడే  రాత్రి పగలూ ఉంటాడు పోలీసోడే ॥ పుష్కరాలు, పండగలు.. కష్టాలు, సుఖాలు.. రాత్రి, పగలు.. తేడా లేకుండా తిండి తిప్పలు మానేసి మరీ పోలీసులు ఎప్పుడూ డ్యూటీ చేస్తుంటారని ఈ చరణంలో చెప్పారు. నిజమే కదా.. మనమంతా పండగ చేసుకుంటుంటే వాళ్లు డ్యూటీ చేస్తుంటారు. మనం పుష్కర స్నానం చేస్తుంటే వాళ్లు సెక్యూరిటీ చూసుకోవడంలో బిజీగా ఉంటారు. ‘ఇంకో జన్మే ఉన్నాదంటే మళ్లీ అవుతా పోలీసే’ అనే లైన్ నాకు బాగా నచ్చింది. వందలో ఒకరో, ఇద్దరో పోలీసులు తప్పులు చేసుండొచ్చు. మెజారిటీ పోలీసులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. వాళ్లను మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి. ‘మా గురించి చాలా మంచి పాట పాడావ్’ అని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పినప్పుడు ఎంతో సంతోషమేసింది.
 ఇంటర్వ్యూ: సత్య పులగం
 
భాస్కరభట్ల గీత రచయిత
సింహా  గాయకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement