సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్‌మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి...
బాక్సింగ్ మేరా కామ్ అని చెప్పే మేరీ కామ్... లేటు వయసులో ఒలింపిక్ పతకాన్ని సాధించి యావద్భారత దేశ దృష్టినీ ఆకర్షించిన మహిళ. మణిపూర్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చినా... కష్టపడి పెకైదిగి ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకం ఎగరేసింది. తనకు కష్టం విలువ తెలుసని చెప్పే మేరీకామ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఎలా ఉంటాయి? ఆమె ఇతరులకిచ్చే సలహా ఏంటి? ఆమె మాటల్లోనే...
కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు చాలా బహుమతులొచ్చాయి. నా సంపాదనలో అత్యధికం కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బహుమతి సొమ్మే. ఈవెంట్లలో గెలవటంతో పాటు ఆయా ప్రభుత్వాలిచ్చిన ప్రోత్సాహకాలు కూడా కొంతవరకూ ఉన్నాయి. వీటన్నిటినీ నేను మొట్టమొదట ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది నా అకాడమీపైనే. తరువాతి ప్రాధాన్యం నా కుటుంబానికి. నాకు ముగ్గురు అబ్బాయిలున్నారు. వాళ్ల పేరున కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశా. మిగిలిన మొత్తంతో కొంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నా. ఇదంతా నా కుటుంబంపై పెట్టిన పెట్టుబడిగా భావిస్తాన్నేను.
చాలామంది నన్ను సాయం అడుగుతుంటారు. నేను మంచి స్పోర్ట్స్ ఉమన్‌గా ఎదిగాక ఇది ఇంకాస్త ఎక్కువయింది. అలా అడిగే వాళ్లకు వివిధ రూపాల్లో నేను సాయం చేస్తుంటా. ఈ సాయం అందుకునే వారు ఎక్కువమంది మణిపూర్ వారే కావచ్చు. వాళ్లకు నేను డొనేషన్లు ఇస్తుంటా. భోజనం పెడుతుంటా. ఇలాంటి సాయాన్ని కూడా నేను ఇన్వెస్ట్‌మెంట్‌గానే భావిస్తా. నా దృష్టిలో ఇది సమాజంపై పెట్టే పెట్టుబడి.
నాకు ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్ సంగతులేవీ తెలి యవు. కానీ ఆదా చేయటం మాత్రం తెలుసు. మొదటి నుంచీ చేసిందే కాబట్టి! అందుకే నా సలహా అదే. కుటుంబం కోసం మనం కొంత ఆదా చేసి తీరాలి. ఇది ఏ కుటుంబానికైనా తప్పనిసరి. ఉన్నంతలో లేని వారికి సాయం చేయటం కూడా అవసరమే.
అంతా అకాడమీపైనే: మేరీ కామ్
Published Fri, Mar 14 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement