ప్యాకేజ్డ్ ఫుడ్స్, కొన్ని రకాల ప్రిజర్వేటెడ్ డ్రింక్స్ తింటే మంచిదికాదని విన్నాం. వాటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడం జరిగిది. అయితే శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో అదే నిజమని ధృవీకరించారు. అందుకోసం సుమారు 30 ఏళ్లు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
బాగా ప్రాసెస్ చేసిన పిండులు(మైదా వంటివి)తో తయారు చేసే స్నాక్స్‌లు, డ్రింక్‌లు తీసుకుంటే ఆయుర్ధాయం తగ్గి, అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడయ్యింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా..ఆలు చిప్స్, బర్గర్, బేకరి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఫైబర్, విటమిన్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
వీటిని ఎక్కువుగా తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడయ్యింది. అందుకోసం తాము 1984 నుంచి 2018 మధ్య సుమారు 11 యూఎస్ రాష్ట్రాల నుంచి70 వేల మంది మహిళా నర్సుల దీర్ఘాకాలిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు.
బాగా శద్ధి చేసిన పిండులతో చేసిన బేకరి పదార్థాలను రోజుకు ఏడుసార్లకు పైగా తీసుకున్న వారిలో అకాల మరణాల ప్రమాదం 4% అని, ఇతర కారణాల వల్ల 9% అని వెల్లడించారు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మరణాలు సంభవించే ప్రమాదం 8%కి పైగా ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు.
ఇక మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తుల వల్ల కూడా అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువేనని చెప్పారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనమే అయినప్పటికీ..ఇది ఎంతవరకు నిజం అనేందుకు కచ్చితమైన నిర్థారణలు లేవు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం శుద్ధి చేసిన పిండులతో చేసే పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలనే విషయాన్ని మాత్రం అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు పరిశోధకులు.
(చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment