మన ఆయుష్షు పెంచేందుకు శాస్త్రవేత్తలు మరో కొత్త మార్గాన్ని కనుక్కున్నారు. మనుషులతోపాటు దాదాపు అన్ని రకాల పాలిచ్చే ప్రాణుల కణాల్లో ఉండే ఒక్క ఎంజైమ్ ఉత్పత్తిని ఆపేస్తే ఎక్కువ కాలం జీవింవచ్చునని లండన్, కెంట్, గ్రానిన్‌గెన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఉమ్మడిగా చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈగలు, కొన్ని రకాల పురుగులపై జరిగిన ఈ ప్రయోగాల్లో కణాల పెరుగుదలకు కీలకమైన ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్ ఎంజైమ్ ఆయుష్షుకు కీలకమని తెలిసింది. సాధారణ పరిస్థితుల్లో ఈ ఎంజైమ్ మూల కణాలపై, పేవులపై దుష్ప్రభావం చూపుతోందని... తాము ఈగలు, పురుగులతో పాటు కొన్ని ఎలుకల్లోనూ ఈ ఎంజైమ్‌ను అడ్డుకున్నప్పుడు పరిస్థితి మారిపోయిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నజీఫ్ అలీ తెలిపారు.
అన్ని రకాల ప్రాణుల్లో ఆయుష్షు రమారమి పది శాతం వరకూ ఎక్కువైనట్లు ఆయన చెప్పారు. ఆయుష్షును పెంచుతాయని ప్రచారం చేసుకుంటున్న కొన్ని రకాల మందుల వెనుక కూడా ఇదే ప్రక్రియ ఉండి ఉండవచ్చునని ఇంకో శాస్త్రవేత్త డానీ ఫైలర్ తెలిపారు. ఈ ఎంజైమ్ తీరుతెన్నులను మరింత క్షుణ్ణంగా తెలసుకుంటే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఒక ఎంజైమ్ ఉత్పత్తిని ఆపడం వల్ల అటు ఆయుష్షు పెరగడంతో పాటు మన పేవుల్లోనూ ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి శాస్త్రవేత్తలు ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment