life span
-
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ప్యాకేజ్డ్ ఫుడ్స్, కొన్ని రకాల ప్రిజర్వేటెడ్ డ్రింక్స్ తింటే మంచిదికాదని విన్నాం. వాటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడం జరిగిది. అయితే శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో అదే నిజమని ధృవీకరించారు. అందుకోసం సుమారు 30 ఏళ్లు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..బాగా ప్రాసెస్ చేసిన పిండులు(మైదా వంటివి)తో తయారు చేసే స్నాక్స్లు, డ్రింక్‌లు తీసుకుంటే ఆయుర్ధాయం తగ్గి, అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడయ్యింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా..ఆలు చిప్స్, బర్గర్, బేకరి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఫైబర్, విటమిన్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వీటిని ఎక్కువుగా తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడయ్యింది. అందుకోసం తాము 1984 నుంచి 2018 మధ్య సుమారు 11 యూఎస్ రాష్ట్రాల నుంచి70 వేల మంది మహిళా నర్సుల దీర్ఘాకాలిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. బాగా శద్ధి చేసిన పిండులతో చేసిన బేకరి పదార్థాలను రోజుకు ఏడుసార్లకు పైగా తీసుకున్న వారిలో అకాల మరణాల ప్రమాదం 4% అని, ఇతర కారణాల వల్ల 9% అని వెల్లడించారు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మరణాలు సంభవించే ప్రమాదం 8%కి పైగా ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు.ఇక మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తుల వల్ల కూడా అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువేనని చెప్పారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనమే అయినప్పటికీ..ఇది ఎంతవరకు నిజం అనేందుకు కచ్చితమైన నిర్థారణలు లేవు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం శుద్ధి చేసిన పిండులతో చేసే పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలనే విషయాన్ని మాత్రం అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు పరిశోధకులు. (చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
World Sparrow Day 2023: పిచ్చుకల జీవిత కాలమెంతో తెలుసా?
వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే దృశ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు. మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోకపోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాటి విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం. ►65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనా పాలకుడు మావో జెడాంగ్ పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధించాడు. పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చిపడేయించాడు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు బతుకుజీవుడా అనుకుంటూ దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి. ►ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండిగింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ. ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక.. ►చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్లను వేటాడి తింటాయి. ►పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్లెడెడ్ పెట్రోల్ అందులో ఒకటి. ఈ పెట్రోల్‌ను మండించినప్పుడు విడుదలయ్యే మిౖథెల్ నైట్రేట్.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు(పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. ►పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్ టవర్ల రేడియేషన్, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి. ►ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తయారు చేసిన రెడ్‌లిస్ట్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ►పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు. ► బరువు 35 నుంచి 40 గ్రాములు. ►ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి..మీ. ►ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి. ►ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు. ►ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి. -
బ్లూ జోన్స్.. బిందాస్‌గా వందేళ్లు బతికేయొచ్చు..
ఎక్కడైనా మనుషులు సగటున 60–70 ఏళ్లు బతుకుతారు. కొందరైతే వందేళ్లూ పూర్తి చేసుకుంటారు. కానీ భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనం మిగతా అన్నిచోట్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. అవే ‘బ్లూ జోన్స్’. మరి ప్రాంతాలేవి? ఎక్కువకాలం బతకడానికి కారణాలేమిటి, వారి ఆహార అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా.. ‘ఆయుర్దాయం’పై అన్వేషణలో.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వయసున్నవారు, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తున్నవారు ఉండే ప్రాంతాలను ‘బ్లూ జోన్’లుగా పిలుస్తున్నారు. అమెరికాకు చెందిన అన్వేషకుడు, రచయిత డాన్ బ్యూట్నర్ ఈ పేరు పెట్టారు. ప్రపంచంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్న జన సమూహాలు, వాటి మధ్య పోలికలను గుర్తించేందుకు నేషనల్ జియోగ్రఫిక్ చానల్, ఇతర నిపుణులు నిర్వహించిన అన్వేషణ కార్యక్రమానికి డాన్ బ్యూట్నర్ నేతృత్వం వహించారు. తమ అధ్యయనంలో పలు ‘బ్లూ జోన్’లను గుర్తించి ఆ వివరాలను నివేదికగా విడుదల చేశారు. కనీసం.. పదేళ్లు ఎక్కువే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లోమా లిండా ప్రాంతం బ్లూజోన్లలో ఒకటి. ఇక్కడ నివసించే ‘సెవంత్ డే అడ్వెంటిస్ట్స్’ఆధ్యాతి్మక బృందం సభ్యులు.. సగటు అమెరికన్ల కంటే కనీసం పదేళ్లు ఎక్కువకాలం జీవిస్తారు. పూర్తిగా శాకాహారులు. మద్యపానానికి దూరంగా ఉంటారు. సింపుల్‌గా.. 90 ఏళ్లు.. కోస్టారికాలోని నికోయా ద్వీపకల్ప ప్రాంత ప్రజల్లో చాలా మంది 90 ఏళ్ల వరకు చలాకీగా బతికేస్తారు. ఆధ్యాతి్మకత, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ.. శారీరక శ్రమతో కూడిన జీవన శైలిని అనుసరిస్తారు. చికెన్, చేపలు, బీఫ్, బీన్స్, అన్నం ప్రధాన ఆహారం. అయితే రిఫైన్డ్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు పూర్తి దూరంగా ఉంటారు. ఆయుష్షులో.. మహిళామణులు జపాన్‌లోని ఒకినావా ద్వీపం ప్రపంచంలో అత్యధికకాలం జీవించే మహిళలకు (వందేళ్లదాకా) కేంద్రం. జపాన్, అమెరికాలతో పోల్చితే.. ఒకినావా వాసులకు వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు, గుండె జబ్బులు, కేన్సర్లు బాగా తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. ఆయుష్షులో.. ‘మగా’నుభావులు.. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు/ప్రాంతాలతో పోల్చితే.. ఇటలీలోని సార్డీనియా ద్వీపంలో పురుషులు అత్యధిక కాలం (వందేళ్ల దాకా) జీవిస్తారు. చాలా వరకు శాకాహారం, ప్రకృతిలో మమేకమై, శారీరక శ్రమతో కూడిన జీవనశైలిని అనుసరిస్తారు. సామాజిక జీవనం.. చిన్న కునుకు.. ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే జనానికి గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం కేరాఫ్ అడ్రస్. ఇక్కడ 90ఏళ్లు పైబడిన ప్రతి పది మందిలో ఆరుగురు ఇప్పటికీ వ్యవసాయం, వృత్తి పనులు చేస్తుంటారని అధ్యయనంలో గుర్తించారు. వీరిలోనూ శాకాహారం, శారీరక శ్రమ మామూలే అయినా.. బంధుమిత్రులతో కలసి గడిపే/పనిచేసే సామాజిక జీవనశైలి, మధ్యాహ్నం పూట చిన్నకునుకు తీసే అలవాటు ప్రత్యేకం. ‘బ్లూజోన్’లలో దీర్ఘాయుష్షు వీటితోనే.. ►బ్లూజోన్లుగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో కామన్‌గా కనిపించిన లక్షణం.. అంతా ఇంటి పనులు, ఇతర శారీరక శ్రమలో నిమగ్నమై ఉండటం. ►క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయడం. ►కుటుంబ బంధాలు, సామాజిక జీవనానికి, పెద్ద వయసు వారికి తోడుగా నిలవడానికి ప్రాధాన్యత. ►ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం, మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం. చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
పెరుగుతున్న ఆయుష్షు
సాక్షి, అమరావతి: మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రజల జీవిత కాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. 2031–35 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, స్త్రీ, పురుషుల ఆయర్దాయంపై నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మగవాళ్ల కన్నా ఆడవాళ్ల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 2011–15 మధ్య మహిళల ఆయుర్దాయం 71.2 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 75.6 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 67.1 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే పురుషులకంటే స్త్రీల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువ ఉంటుందని నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో 2011–15 మధ్య స్త్రీల ఆయుర్దాయం 70 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 74.7 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 66.9 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక దేశం మొత్తంమీద కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేశారు. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031–35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల ఆయుర్దాయం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పురుషుల, స్త్రీల ఆయుర్దాయం అత్యల్పంగా ఉంటుందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో 2031–35 మధ్య పురుషుల ఆయుర్దాయం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో ఏటేటా పురుషులు, స్త్రీల ఆయుష్షు పెరుగుతుందని నివేదిక తెలిపింది. పెరుగుతున్న వృద్ధులు అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుతుండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు జనం ఆయుర్దాయం పెరుగుతుండటం దీనికి కారణమని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4 శాతం ఉంది. 2031–35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. -
ప్రపంచానికి శనిలా పట్టుకుంది!
ఒక్కసారి పట్టుకుంటే ఏళ్ల పాటు వదలదని ఏలినాటి శనికి పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కూడా ఇంతే! ఏడాది కాలంలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి.. భవిష్యత్తులోనూ మానవాళికి అనేక రకాలుగా సమస్యగానే మిగిలిపోనుంది. ఆయు ప్రమాణాలను తగ్గించడం మాత్రమే కాదు.. కోట్ల మందిని పేదరికం కోరల్లోకి తోసేయనుంది! సాక్షి, హైదరాబాద్: రోగమొచ్చింది.. మందేసుకున్నాం.. తగ్గింది.. హమ్మయ్య.. ఇక ఏ చింతా లేదు! ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యమొస్తే మనం ఆలోచించిన తీరిది.. కానీ కోవిడ్ విషయంలో ఈ ఆలోచన పూర్తిగా మారి పోతోందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావం కొంతకాలం ఉంటుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కరోనా విషయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని.. కానీ కొన్ని కేసుల్లో దాని ప్రభావం మెదడు, గుండెలపై కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి. (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం) రోగ నిరోధక శక్తి తగ్గుదల, దీర్ఘకాలం పాటు నిస్సత్తువ, తలనొప్పితో పాటు గుండె, శ్వాస సమస్యలు కొనసాగుతాయి..’అని మేయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ పోలాండ్ అన్నారు. కోవిడ్ వ్యాధి కణస్థాయిలో జరిపే విధ్వంసం ఇందుకు కారణమవు తుందన్నది ఆయన అంచనా.. వీటితోపాటు కొంతమంది కండ రాలు, దగ్గు వంటి లక్షణాలూ కనపరచవచ్చు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను పరిశీలించినప్పుడు కండరాలు దెబ్బతిన్నట్లు తెలిసిందని, ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లోనూ నష్టం ఎక్కువగా ఉందని మేయో క్లినిక్ జరిపిన పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాకుండా.. రక్తంలో చిన్నసైజు ముద్దల్లాంటివి ఏర్పడతాయని, పెద్దసైజు వాటితో గుండెజబ్బులు వస్తే చిన్నవాటితో గుండెకు వెళ్లే చిన్న చిన్న ధమనులు మూసుకుపోతాయని చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మాత్రమే కనిపిస్తుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.. (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం) ఆయుః ప్రమాణాల తగ్గుదల వైద్య సదుపాయాలు పెరగటం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగాయి. అయితే కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన శ్రమ మొత్తం నీరు కారిపోనుంది. ఆయు ప్రమాణాలు భారీగా తగ్గనున్నాయని దాదాపు మూడు దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాకపోతే ఇది ఆయా దేశాల్లో వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఆయు ప్రమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉండనుంది. పీఎల్ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడ్డ వారు పది శాతం వరకు ఉంటే.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుంది. షాంఘై యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ (ఆస్ట్రియా), యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూకే) శాస్త్రవేత్తల ఈ అధ్యయనం ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువున్న చోట్ల ఆయుష్షు 3 నుంచి 8 ఏళ్ల వరకు తగ్గవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది రెండు నుంచి ఏడేళ్లు.. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండవచ్చు. (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) పెరగనున్న పేదరికం... ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా తగ్గుతున్న పేదల సంఖ్య కోవిడ్ కారణంగా ఇకపై పెరగనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది మళ్లీ కఠిన దారిద్య్రం బారిన పడనుండగా.. ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరికల్లా 15 కోట్లకు పెరుగుతుంది. రోజుకు 2 డాలర్లు లేదా రూ.150 కంటే తక్కువ ఆర్జించే వారిని పేదలుగా గుర్తించి ప్రపంచబ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పేదల జనాభా 7.9 శాతంగా ఉండేదని, ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు అది 9.1 నుంచి 9.4 శాతం వరకు పెరగనుందని ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యూహాలతో ముందు కెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇలా పేదరికం బారిన పడే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే పేదరికం ఎక్కువున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. మధ్య ఆదాయ దేశాల్లోనూ గుర్తించదగ్గ స్థాయిలో ప్రజలు పేదలుగా మారతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధాల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశాల్లో కోవిడ్ గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారిందని తెలిపింది. ఈ పరిణామం వల్ల 2030 నాటికి పేదల జనాభాను 7 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ప్రపంచబ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఇబ్బంది ఏర్పడనుంది. -
దీర్ఘాయుష్షు కిటుకు రూఢీ అయింది..
కాయగూరలు, పండ్లు బాగా తింటే ఆయుష్షు పెరుగుతుందనేది చాలామంది నమ్మిక. ఇందులో నిజం లేకపోలేదు కూడా. కాకపోతే ఇదెలా జరుగుతోందన్నది మాత్రం తాజా పరిశోధన ద్వారా తెలిసింది. కాయగూరలు, పండ్లలో ఉండే ఫిసెటిన్ అనే ఫ్లేవనాయిడ్ పాడైపోయి.. విభజన ఆగిపోయిన కణాలను శరీరం నుంచి బయటకు పంపడంలో ఉపయోగపడతాయని, ఫలితంగా ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా మెరుగవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో మన రోగ నిరోధక వ్యవస్థ పాడైన కణాలను తొలగిస్తూంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యమూ తగ్గిపోవడం వల్ల పాడైన కణాలు శరీరంలో పోగుపడుతూంటాయి. ఈ పరిణామం కాస్తా మంట, వాపులకు.. తద్వారా వ్యాధులకు దారితీస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో పాడైన కణాలను శరీరం నుంచి తొలగించే మందుల తయారీకి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పది ఫ్లేవనాయిడ్లపై పరిశోధనలు జరగ్గా ఫిసెటిన్తో మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసింది. ఎలుకలతోపాటు మానవ కణజాలంపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు రావడంతో మానవ ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిసెటిన్ అనేది సహజసిద్ధమైన పదార్థం కావడం వల్ల మానవ ప్రయోగాలూ సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ రాబిన్స్ అంటున్నారు. -
ఆదాయం, ఆయుష్షు భేష్
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్... మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లోనూ ముందడుగు వేస్తోంది. వివిధ అంశాల్లో గతంతో పోలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత రెండున్నర దశాబ్దాల్లో హెచ్డీఐలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 1990లో భారత్ హెచ్‌డీఐ విలువ 0.427 ఉండగా 2017 నాటికది 0.640కు పెరిగింది. అలాగే అదే కాలానికి భారతీయుల ఆయుర్దాయం 11 ఏళ్లు మెరుగుపడింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే లింగ సమానత్వం మాత్రం ఆందోళనకరంగా ఉందని నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్యల్లో పురోగతి... స్థూల జాతీయ తలసరి ఆదాయం ఆధారంగా జీవన ప్రమాణాన్ని, ఆయుర్దాయం ఆధారంగా ఆరోగ్యాన్ని, పాఠశాల విద్య ఆధారంగా విద్య స్థాయిని అంచనా వేసి ఐక్యరాజ్యసమితి హెచ్‌డీఐ నివేదిక రూపొందిస్తుంది. ఈ మూడు అంశాల్లో ఆయా దేశాలు సాధించిన ప్రగతి ఆధారంగా వాటికి 0 నుంచి 1 వరకు పాయింట్లు ఇస్తుంది. ఆ పాయింట్లను బట్టి ఆ దేశం ఎన్నో స్థానంలో ఉందో నిర్ణయిస్తుంది. 1990 నుంచి చూసుకుంటే ఈ మూడు అంశాల్లోనూ భారత్ మంచి పురోగతినే సాధించిందని ఐరాస పేర్కొంది. దాదాపు 50 శాతం వృద్ధి నమోదు చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆయుర్దాయం పెరగడం, ఎక్కువ మంది చదువుకోవడం, తలసరి ఆదాయం పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డీఐ విలువ 22 శాతం పెరిగింది. అలాగే తలసరి ఆదాయం ఈ 27 ఏళ్లలో ఏకంగా 266 శాతం పెరిగింది. హెచ్‌డీఐ విలువ తక్కువ ఉన్న దేశాల్లో పిల్లలు 60 ఏళ్లు జీవిస్తారని అంచనా వేయగా అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాల్లో పిల్లలు 80 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఆదాయంలో 267 శాతం పెరుగుదల... తలసరి ఆదాయంలో సైతం భారత్ దక్షిణాసియాలోని పొరుగు దేశాలతో పోల్చుకుంటే చెప్పుకోతగ్గ స్థాయిలో అభివృద్ధి చెందింది. 1990లో మన తలసరి ఆదాయం రూ. 1,24,957కాగా 2017 నాటికి 267 శాతం పెరిగి రూ. 4,58,083కు చేరుకుంది. లింగ సమానత్వంలో పరిస్థితి ఆందోళనకరం... అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నా లింగ సమానత్వం విషయంలో మాత్రం భారత్ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని యూఎన్డీపీ ఇండియా కంట్రీ డైరెక్టర్ ఫ్రాన్సిన్ పికప్ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఆదాయం విషయాల్లో భారత్‌లో లైంగిక అసమానత కొనసాగుతోందని, ఇది దేశాభివృద్ధిపై దుష్ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు కంటే భారత్ సగటు 26.8 శాతం తక్కువ ఉందని నివేదిక స్పష్టం చేసింది. లింగ సమానత్వ సూచీలో భారత్ 160 దేశాల్లో 127వ స్థానంలో ఉంది. విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారతీయ మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే నామమాత్రంగా ఉందని యూఎన్డీపీ నివేదిక తెలిపింది. పార్లమెంటులో కేవలం 11.6 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మాధ్యమిక విద్య వరకు చదివిన వారిలో పురుషులు 64 శాతం ఉండగా మహిళలు 39 శాతమే ఉన్నారు. ఇక శ్రామికశక్తిలో మహిళల వాటా 27.2 శాతంకాగా పురుషులు 78.8 శాతం మంది ఉన్నారు. అంతర్జాతీయంగా శ్రామికశక్తిలో మహిళల వాటా 49 శాతంకాగా, పురుషుల వాటా 75 శాతంగా ఉంది. అభివృద్ధికి కీలకమైన విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్రాన్సిన్ అభిప్రాయపడ్డారు. మన ఆయుష్షు పెరిగింది భారతీయులు గతంకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయుర్దాయంలో 1990 కంటే మెరుగైన ఫలితాలను ఐక్యరాజ్య సమితి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారత్‌లో గుర్తించింది. 1990లో భారతీయుల ఆయుఃప్రమాణం కేవలం 57.9 సంవత్సరాలే ఉండగా 2017 మానవాభివృద్ధి సూచీలో భారతీయుల ఆయుఃప్రమాణం ఏకంగా 11 ఏళ్లు పెరిగి దాదాపు 70 ఏళ్లకు చేరువవుతోంది. ప్రస్తుతం మన భారతీయుల ఆయుఃప్రమాణం 68.8 ఏళ్లు. భారతీయులకంటే బంగ్లాదేశీయుల ఆయుఃప్రమాణం అధికంగా నమోదైంది. మన దేశస్తులు దాదాపు 69 ఏళ్లు జీవిస్తుంటే, బంగ్లాదేశీయులు సగటు జీవిత కాలం 73 ఏళ్లు. స్త్రీల ఆయుఃప్రమాణం... భారతదేశంలో 70.4 ఏళ్లు బంగ్లాదేశ్‌లో 74.6 ఏళ్లు పాకిస్తాన్లో 67.7 ఏళ్లు పురుషుల ఆయుఃప్రమాణం... భారతదేశంలో 67.3 ఏళ్లు బంగ్లాదేశ్‌లో 71.2ఏళ్లు పాకిస్తాన్లో 65.6 ఏళ్లు -
ఆ ఎంజైమ్‌ను ఆపేస్తే.. నిండు నూరేళ్లు!
మన ఆయుష్షు పెంచేందుకు శాస్త్రవేత్తలు మరో కొత్త మార్గాన్ని కనుక్కున్నారు. మనుషులతోపాటు దాదాపు అన్ని రకాల పాలిచ్చే ప్రాణుల కణాల్లో ఉండే ఒక్క ఎంజైమ్ ఉత్పత్తిని ఆపేస్తే ఎక్కువ కాలం జీవింవచ్చునని లండన్, కెంట్, గ్రానిన్గెన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఉమ్మడిగా చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈగలు, కొన్ని రకాల పురుగులపై జరిగిన ఈ ప్రయోగాల్లో కణాల పెరుగుదలకు కీలకమైన ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్ ఆయుష్షుకు కీలకమని తెలిసింది. సాధారణ పరిస్థితుల్లో ఈ ఎంజైమ్ మూల కణాలపై, పేవులపై దుష్ప్రభావం చూపుతోందని... తాము ఈగలు, పురుగులతో పాటు కొన్ని ఎలుకల్లోనూ ఈ ఎంజైమ్‌ను అడ్డుకున్నప్పుడు పరిస్థితి మారిపోయిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నజీఫ్ అలీ తెలిపారు. అన్ని రకాల ప్రాణుల్లో ఆయుష్షు రమారమి పది శాతం వరకూ ఎక్కువైనట్లు ఆయన చెప్పారు. ఆయుష్షును పెంచుతాయని ప్రచారం చేసుకుంటున్న కొన్ని రకాల మందుల వెనుక కూడా ఇదే ప్రక్రియ ఉండి ఉండవచ్చునని ఇంకో శాస్త్రవేత్త డానీ ఫైలర్ తెలిపారు. ఈ ఎంజైమ్ తీరుతెన్నులను మరింత క్షుణ్ణంగా తెలసుకుంటే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఒక ఎంజైమ్ ఉత్పత్తిని ఆపడం వల్ల అటు ఆయుష్షు పెరగడంతో పాటు మన పేవుల్లోనూ ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి శాస్త్రవేత్తలు ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాలని సూచించారు. -
ఈ బామ్మ ఆయుష్షు గట్టిదే..!
ఆయుష్షు గట్టిగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడి బతుకుతారు. అదే లేకపోతే ఏ కారణం లేకుండానే కన్నుమూస్తారు. ఇలాంటి సంఘటనల గురించి రోజూ పేపర్లో మనం చదువుతూనే ఉంటాం. ఇక్కడ మనం చెప్పుకోబోతున్న బామ్మ ఆయుష్షు కూడా గట్టిదే. ఎందుకంటే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన ఈ బామ్మ ఏకంగా 80 కిలోమీటర్లపాటు కొట్టుకుపోయి, 13 గంటల తర్వాత సురక్షితంగా బయటపడింది. పశ్చిమబెంగాల్‌ను ప్రస్తుతం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపు 30 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఉప్పొంగుతున్న నదులు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతున్నాయి. మహోగ్రంగా ప్రవహిస్తున్న దామోదర్ నది బుర్ద్వన్ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. కాళీబజార్కు పెద్దగా వరద ముప్పు లేకపోయినా.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 62 ఏళ్ల తపతి చౌదరీ, సమీపంలోనే ఉన్న నదీ ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది. ప్రవాహాన్ని చూస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. చూస్తుండగానే కొట్టుకుపోయింది. దీంతో అంతా ఆమెమీద ఆశలు వదులుకున్నారు. అలా కొట్టుకుపోయిన తపతి దాదాపు 13 గంటలపాటు మృత్యువుతో పోరాడింది. 80 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ప్రవాహం కాస్త నెమ్మదించడంతో తనను రక్షించాలంటూ ఆమె పెట్టిన కేకలు విన్న జాలర్లు ఆమెను రక్షించారు. కాసేపు సపర్యలు చేసిన తర్వాత కోలుకున్న తపతిని ప్రశ్నించడంతో.. తాను మర్కుందా ఘాట్‌కు సమీప నివాసినని, ప్రమాదవశాత్తు నదిలో పడ్డానని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతం ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం తపతి చౌదరీ వంతైంది. ఎందుకంటే తాను అంతదూరం కొట్టుకొచ్చిన విషయం బామ్మ కూడా గుర్తించలేకపోయింది. -
ఆడాళ్ల కంటే మగాళ్లకి ఆయుష్షు తక్కువ
అవును.. మీరు విన్నది నిజమే. సవాలక్ష కుటుంబ బాధ్యతలు, బాధలతో సతమతమయ్యే మగాళ్లకు.. ఆడవాళ్ల కంటే ఆయుష్షు బాగా తక్కువగా ఉంటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో తేలింది. ఇది ఏదో ఒక దేశానికే పరిమితమైన లక్షణం కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉందట. ఎక్కువ మంది మగాళ్లు గుండెపోటుతో గుటుక్కుమంటున్నారు. 20వ శతాబ్దంలో ఎక్కువగా ఇలాంటి ట్రెండే కనిపించింది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం ఈ విషయాలు చెప్పింది. 19వ శతాబ్దం తొలి రోజుల వరకు అయితే ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు ఉండటంతో మగవాళ్లలో కూడా మరణాల రేటు తక్కువగా ఉండేది. కానీ, తర్వాతి కాలంలో మహిళల ఆయుష్షు అలాగే ఉండగా.. మగాడిది మాత్రం తగ్గిపోతూ వచ్చింది. 13 అభివృద్ధి చెందిన దేశాలలో 1800 నుంచి 1935 వరకు పుట్టిన వారి జీవిత కాలాన్ని ఈ బృందం పరిశీలించింది. పొగతాగడం, తద్వారా వచ్చే గుండె జబ్బులు ఇలాంటివన్నీ మగాళ్ల మరణాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయని పరిశోధనలో తేల్చారు.