కూల్‌డ్రింక్ అనుకుని.. | child twins drinks chemical due to water in kurnool | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్ అనుకుని..

Published Tue, Nov 3 2015 6:12 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

child twins drinks chemical due to water in kurnool

కర్నూలు:  కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల మండలం పాండురంగాపురంలో చిన్నారులు కూల్‌డ్రింక్ అనుకుని ఇంట్లో ఉన్న పురుగుమందు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామంలో ఓ రైతుకు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు హిమజ, హేమశ్రీ ఉన్నారు. వారు మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బాటిల్‌లో కనిపించిన పురుగుమందు తాగారు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి ఇద్దరినీ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement