కరీంనగర్ క్రైం: పల్లె ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్న బెల్ట్‌షాపుల నిర్వహణకు ప్రభుత్వ కళ్లెం వేసేలా చర్యలకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు ఎత్తివేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారుగా మూడువేల వరకు బెల్ట్‌షాపులుండగా రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. పల్లెల్లో పదుల సంఖ్యలో కిరాణషాపులు, హోటళ్లలో బాహటంగానే దందా నడుస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు శ్రీమామూలుశ్రీగా తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మద్యానికి బానిసలుగా..
► గ్రామాల్లో బెల్ట్‌షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉండడంతో కూలీలు మొదలుకుని రైతులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువశాతం తాగడానికే వెచ్చించడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
► వైన్స్‌లు నిర్ణీత సమయాల్లో మూసివేస్తున్నా.. బెల్ట్‌షాపులకు నియంత్రణ లేకపోవడంతో యువత ఎక్కువశాతం బానిసలవుతున్నారని మహళల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
► బెల్ట్‌షాపులను మూసివేయాలని పలుమార్లు మహిళలు, వివిధ సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెల్ట్‌షాపులపై ఎకై ్సజ్‌శాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్‌షాపులు నిర్వహించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
► అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అన్ని బెల్ట్‌షాపులు మూసివేయించారు. కోడ్ ముగియగానే మళ్లీ బెల్ట్‌షాపుల దందాలకు రెక్కలొచ్చాయి. జిల్లావ్యాప్తంగా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపులకు సంబంధించిన అధికారుల మూముళ్ల విషయం వైన్స్ నిర్వాహకులే చూసుకుంటున్నట్లు తెలిసింది.
► రూరల్‌ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కొందరు ఈ వ్యవహరాన్ని మామూలుగా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో బెల్ట్‌షాపులు మూసివేసి వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment