beltshop
-
Telangana: మందు బాబులకు షాకింగ్ న్యూస్..
కరీంనగర్ క్రైం: పల్లె ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్న బెల్ట్‌షాపుల నిర్వహణకు ప్రభుత్వ కళ్లెం వేసేలా చర్యలకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు ఎత్తివేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారుగా మూడువేల వరకు బెల్ట్షాపులుండగా రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. పల్లెల్లో పదుల సంఖ్యలో కిరాణషాపులు, హోటళ్లలో బాహటంగానే దందా నడుస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు శ్రీమామూలుశ్రీగా తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యానికి బానిసలుగా.. ► గ్రామాల్లో బెల్ట్‌షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉండడంతో కూలీలు మొదలుకుని రైతులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువశాతం తాగడానికే వెచ్చించడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ► వైన్స్‌లు నిర్ణీత సమయాల్లో మూసివేస్తున్నా.. బెల్ట్‌షాపులకు నియంత్రణ లేకపోవడంతో యువత ఎక్కువశాతం బానిసలవుతున్నారని మహళల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ► బెల్ట్‌షాపులను మూసివేయాలని పలుమార్లు మహిళలు, వివిధ సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెల్ట్‌షాపులపై ఎకై ్సజ్‌శాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్‌షాపులు నిర్వహించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ► అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అన్ని బెల్ట్‌షాపులు మూసివేయించారు. కోడ్ ముగియగానే మళ్లీ బెల్ట్‌షాపుల దందాలకు రెక్కలొచ్చాయి. జిల్లావ్యాప్తంగా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపులకు సంబంధించిన అధికారుల మూముళ్ల విషయం వైన్స్ నిర్వాహకులే చూసుకుంటున్నట్లు తెలిసింది. ► రూరల్ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కొందరు ఈ వ్యవహరాన్ని మామూలుగా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో బెల్ట్‌షాపులు మూసివేసి వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు!
ఇది కనగానపల్లి మండలం బద్దలాపురంలో నాటు సారా తయారీ స్థావరం. గ్రామ సమీపంలో ఉండే పొలాల్లోనే సారా కాస్తున్నారు. ఇక్కడ రోజుకు 1500 లీటర్ల సారా తయారు చేస్తున్నట్లు సమాచారం. గ్రామంలో 10 కుటుంబాలు దాకా ఇదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యర్థ పదార్థాలతో తయారుచేసే ఈ నాటు సారాను లీటరు రూ.100లతో విక్రయిస్తున్నారు. విషపూరితమైన నాటుసారా తాగి గ్రామంలో చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలను పొగొట్టుకొంటున్నారు. నాటుసారాకు బానిసైన ఓ వ్యక్తి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బెల్టు షాపులు రద్దు కావటంతో నాటుసారా అన్ని చోట్లకు విస్తరిస్తోంది. కనగానపల్లి మండలంతోపాటు చెన్నేకొత్తపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో కూడా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాల్లో నాటుసారా తయారీదారులు ఉన్నట్లు సమాచారం. సాక్షి, కనగానపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను మద్యం మత్తు నుంచి దూరం చేయాలని గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేసింది. అయితే నాటుసారా తయారీదారులు పేదల బతుకుల్లో కుంపటి పెడుతున్నారు. బెల్టు షాపుల రద్దు తర్వాత గ్రామాల్లో నాటు సారాయి తయారీ, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మద్యం మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజారోగ్యం ప్రశ్నార్థకం కుళ్లిన పండ్లు, వ్యర్థ పదార్థాలతో ఈ నాటుసారా తయారు చేస్తుండటంతో ఇది చాలా మత్తుగా ఉండటంతో పాటు విష పూరితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నాటుసారా తయారీలో ఎక్కువగా కుళ్లిన అరటి పండ్లు, చెడిపోయిన బెల్లం, యూరియా వంటి పదార్థాలు వినియోగిస్తారు. దీనిని తయారు చేసేందుకు రూ.20(లీటర్‌కు) ఖర్చు వస్తే, తర్వాతా దీనిని రూ.100 లకు విక్రయిస్తూ తయారీదారులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే దీనిని తాగేవారు మాత్రం ఆర్థికంగా నష్టపోవటంతో పాటు వారి ఆరోగ్యాలను కూడా పాడు చేసుకొంటున్నారు. బద్దలాపురంలో నాటుసారా ఎక్కువగా సేవించి ఆరోగ్యాలు పాడుచేసుకొని కొందరు ప్రాణాలను కూడా పొగొట్టుకొంటున్నారని గ్రామంలోని మహిళలు వాపోయారు. దాడులు చేస్తే ఒట్టు.. మండలంలో పలుచోట్ల నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నా, దీనిని నివారించవలసిన ఎక్సైజ్ అధికారులు మండలంలో ఎక్కడా దాడులు చేయటం లేదు. దీంతో బద్దలాపురం, వేపకుంట, తూంచర్ల, పాతపాళ్యం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో సాధారణ పోలీస్ సిబ్బంది కూడా కేవలం మద్యం బెల్టు షాపులపై మాత్రం దాడులు చేసి, నాటు సారా విక్రయాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి నాటుసారా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మద్యాన్ని ప్రజలకు దూరం చేయాలి మద్యపానంతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయించినా కొన్ని గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా దెబ్బతినటంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారు. బద్దలాపురంలోనే నాటుసారాకు అలవాటు పడి చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకొన్నారు. ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేసి నాటుసారా తయారీని అరికట్టాలి. –నాగార్జున, బద్దలాపురం, కనగానపల్లి మండలం స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను పూర్తీగా నివారించాం. అయితే గ్రామాల్లో నాటుసారా తయారీ జరుగుతున్నట్లు మాకు ఎక్కడా సమాచారం లేదు. నాటుసారా తయారీ స్థావరాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వాటిపై దాడులు చేసి, విక్రయదారులపై చర్యలు తీసుకొంటాం. –తఖీబాషా, ఎక్సైజ్ సీఐ, చెన్నేకొత్తపల్లి -
బెల్ట్‌షాపును ధ్వంసం చేసిన మహిళలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి శివారు హన్మాండ్లపల్లి గ్రామంలోని బెల్ట్షాప్ను మహిళలు శుక్రవారం ధ్వంసంచేశారు. తాము రోజంతా కష్టపడి కూలి చేసి సంపాదించిన సొమ్ముతో తమ భర్తలు తాగి వచ్చి.. తమనే కొడుతున్నారని పలువురు మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సంపంగి సుభద్ర, చొప్పరి సరోజలను మహిళలు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవటంతోనే మద్యం ధ్వంసం చేసినట్లు వివరించారు. అనంతరం సుల్తానాబాద్ పోలీసులకు బెల్ట్‌షాపు రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందించారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీవోఏ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, కార్యదర్శి చొప్పరి లక్ష్మి, గంగ, బోయిని వినోద, గాదాసు సునీత, చిక్కుడు రాజేశ్వరి, రాజేందర్ తదితరులు కోరారు. -
రూ.10.50 లక్షలు పలికిన బెల్ట్‌షాప్
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో బెల్ట్షాప్నకు గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించిన వేలంలో రూ. 10.50 లక్షలు ధర పలికింది. గ్రామంలో గతంలో ప్రభుత్వ అనుమతితో మద్యం దుకాణాన్ని నిర్వహించేవారు. అయితే, గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)కి డబ్బులు చెల్లించాల్సి రావడంతో వ్యాపారులు ఇక్కడి షాపునకు టెండర్లు వేయడం మానేశారు. దాంతో ప్రభుత్వం కూడా అక్కడ మద్యం దుకాణం ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించలేదు. మేజర్ గ్రామం కావడంతో మద్యం అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో వీడీసీ కొన్నేళ్లుగా ఏటా దసరా తర్వాత కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వేలం నిర్వహిస్తోంది. ఈసారి అలాగే వేలం వేయగా, ఓ వ్యాపారి రూ.10.50 లక్షలకు దక్కించుకున్నట్లు తెలిసింది. గతేడాది వ్యాపారులు సుమారు రూ.16 లక్షల వరకు పాడారు. బెల్టు షాప్ దక్కించుకున్న వారు ఎమ్మార్పీపై అదనంగా రూ.10 చొప్పున అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం. -
మద్యం రక్కసిపై కన్నెర్ర
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారిపై ఆ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. పంచాయతీ పాలకులపై ఒత్తిడి తెచ్చారు. గ్రామంలో మద్యనిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరపటంగానీ, మద్యం సేవించడం గానీ చేయకూడదంటూ పంచాయతీ తీర్మానం చేయించారు. వివరాలివి.. సుమారు ఆరువేల మందికిపైగా జనాభా కలిగిన గ్రామం జొన్నలగడ్డ. గత దశాబ్దన్నర నుంచి గ్రామంలో పుట్టగొడుగుల్లా మద్యం గొలుసు దుకాణాలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది మద్యం మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలువైన జీవితాలను అర్ధంతరంగా చాలించారు. గ్రామంలో వేల రూపాయల మద్యం అమ్మకాలు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఎన్నికైంది. ప్రజల బాధలను అర్ధం చేసుకున్న పాలకులు గ్రామంలో మద్యం మహమ్మారిని పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటుచేసి తమ పంచాయతీ పరిధిలో మద్యం, బెల్టుషాపులు నడవకూడదని తీర్మానించారు. యథేచ్ఛగా మద్యం సేవించకూడదని, అలాచేస్తే చర్యలు తీసుకుంటామంటూ తీర్మానించారు. జొన్నలగడ్డ శివారు గ్రామం రంగారెడ్డిపాలెంలో 40 ఏళ్లుగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అలాగే పాలపాడు గ్రామంలో దశాబ్దన్నర నుంచి పూర్తిగా మద్యాన్ని నిషేదించారు. ఆ రెండు గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంతా హర్షిస్తున్నారు. ప్రజల కోసం తీర్మానం.. మద్యం మహమ్మారి వల్ల గ్రామస్తులు పడుతున్న బాధలు అర్ధం చేసుకున్నాం. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించాం. ప్రజలు కూడా సహకరించాలి. - దొండేటి అప్పిరెడ్డి, సర్పంచి మహిళలకు సంతోషం.. మద్యానికి బానిసలై అనారోగ్యంతో ఇప్పటికే ఎంతోమంది మృతి చెందారు. కొందరు అప్పులపాలై, అనారోగ్యానికి గురై అవస్థలు పడుతున్నారు. మా గ్రామంలో మద్యపానం నిషేదించడం మహిళలందరికీ సంతోషంగా ఉంది. - దేవిరెడ్డి రాజ్యలక్ష్మి