పులి భయంతో రెండు గ్రామాలు వణికిపోత్నున్నాయి. ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేయడంతో మరింత ఎక్కువైంది. దీంతో యంత్రాంగం కదిలి వచ్చి గ్రామంలో కర్ఫ్యూ విధించి, అంగన్ వాడిలు, పాఠశాలలను మూసివేయాలని ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనిచోటు చేసుకుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని రిఖానిఖాల్, ధూమాకోట్ తహసీల్ గ్రామాలు పులి భయంతో హడలిపోతున్నాయి.
అదీగాక ఇటీవల ఇద్దరు వ్యక్తులను పులి హతమర్చాడంతో దెబ్బకు పౌరీ గర్హ్వల్ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే ఆయ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలు, పాఠశాలలను ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేసింది.
యంత్రాంగం ఆదేశాల మేరకు ధుమాకోట్, రిఖానిఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులిబారినపడే అవకాశం ఉన్న కటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది. కాగా, లాన్స్‌డౌన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దలీప్ రావత్ ఈ ప్రాంత నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు.
(చదవండి: భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు)
Comments
Please login to add a commentAdd a comment