shuts
-
పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత
పులి భయంతో రెండు గ్రామాలు వణికిపోత్నున్నాయి. ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేయడంతో మరింత ఎక్కువైంది. దీంతో యంత్రాంగం కదిలి వచ్చి గ్రామంలో కర్ఫ్యూ విధించి, అంగన్ వాడిలు, పాఠశాలలను మూసివేయాలని ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనిచోటు చేసుకుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని రిఖానిఖాల్, ధూమాకోట్ తహసీల్ గ్రామాలు పులి భయంతో హడలిపోతున్నాయి. అదీగాక ఇటీవల ఇద్దరు వ్యక్తులను పులి హతమర్చాడంతో దెబ్బకు పౌరీ గర్హ్వల్ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే ఆయ ప్రాంతాల్లోని అంగన్వాడీలు, పాఠశాలలను ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేసింది. యంత్రాంగం ఆదేశాల మేరకు ధుమాకోట్, రిఖానిఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులిబారినపడే అవకాశం ఉన్న కటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది. కాగా, లాన్స్‌డౌన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దలీప్ రావత్ ఈ ప్రాంత నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు. (చదవండి: భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు) -
షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా షావోమి Mi Pay, Mi క్రెడిట్ యాప్‌లను స్థానిక ప్లే స్టోర్, అలాగే తన సొంత యాప్ స్టోర్ నుండి తీసివేసిందని టెక్ క్రంచ్ శుక్రవారం నివేదించింది. (Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం) ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, వినియోగదారులను బిల్లు చెల్లింపులు, నగదు బదిలీల సేవలకు సంబంధించి యాప్, రెగ్యులేటరీ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన Mi Pay ఇకపై అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే దీనిపై షావోమి కానీ, ఎన్పీసీఐ కానీ అధికారింగా ఇంకా స్పందించ లేదు. కాగా భారతదేశంలో భారీ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది షావోమి. దీనికి సంబంధించి ఈడీ దాడుల్లో 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీం చేసుకుంది. దీన్ని ఎత్తివేయడానికి భారతీయ కోర్టు ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఆ రెండు గంటలు ఐఆర్సీటీసీ పనిచేయదు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ ఐఆర్సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది. నవంబరు10, 2018 రోజున 00.20 గంటల నుంచి 01.30 గంటల వరకు రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం, ఎంక్వయిరీ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఐఆర్సీటీసీ (irctc.co.in) సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవనీ, రెండు గంటల సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, కీలక సర్వీసులు సైతం నిలిచిపోనున్నట్టు పేర్కొంది. దీన్ని రైల్వే వినియోగదారులకు గుర్తించాలని కోరింది. రైల్వే టికెట్ బుకింగ్, టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం వెబ్సైట్ నిర్వహణ కారణంగా నవంబరు 10వ తేదీ 00:20 నుంచి 01:30 గంటలు వరకు అందుబాటులో ఉండదు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో రిజర్వేషన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ బుకింగ్, ఎంక్వైరీ సర్వీసులు (టెలిఫోన్ నెంబర్ 139) కూడా పనిచేయవని ఐఆర్సీటీసీ తెలిపింది. సాధారణంగా ప్రతిరోజు వెబ్సైట్ నిర్వహణ పనులు 23:30 గంటల నుంచి 00:30 గంటల మధ్యలో జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. -
మిల్లు మూత: వేలమంది ఉద్యోగుల తొలగింపు
కోలకతా: ఒక పక్క ప్రధానమంత్రి నరనేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెద్ద యుద్ధమే చేస్తుండగా మరోవైపు రాష్ట్రంలో వేలమంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో హౌరా జిల్లాలోని జనపనార మిల్లును తాత్కాలికంగా మూత పడింది. పెద్ద నోట్ల రద్దుతో రాజధాని నగరం కోలకతాకు 7 కిలోమీటర్ల దూరంలో గూసూరి లో ఉన్న శ్రీ హనుమాన జూట్ మిల్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోకార్మికులకు జీతాలు చెల్లించలేక తాత్కాలికంగా జూట్ మిల్లును మూసివేస్తున్నట్టు శ్రీ హనుమాన జూట్ మిల్లు యాజమాన్యం ప్రకటింది. దీంతోపాటు దాదాపు 2500 మంది ఉద్యోగులను పనిలో నుంచి తొలగిచింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. కార్మికుల జనరల్ బాడీ మీటింగ్ లో ఈనిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. డీమానిటైజేషన్ తరువాత కార్మికుల ఆందోళనలు, చెల రేగిన హింస కారణంగా ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని తెలిపింది. ప్రతి షిప్టులో తో కార్మికుల హాజరు శాతం బాగా తగ్గిందని నోటీసులో పేర్కొంది. డిశెంబర్ 5నుంచి, తదుపరి ఆదేశాల వరకు ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. చిన్న వ్యాపార సంస్థలు మూతతో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాలు కోతకు దారితీస్తోంది. జిల్లాలోని అనేక వ్యాపార యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయని, ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే మరింత ఈ బ్లడ్ బాత్ ఇక ముందు కూడా కొనసాగునుందని సహకారం మంత్రి, తృణమూల్ నేత అరుప్ రాయ్ వ్యాఖ్యానించారు. దీంతో కార్మిక వర్గంలో ఆందోళన చెలరేగింది. వందలాది మంది ఉద్యమానికి దిగారు. అయితే యాజమాన్యం నిర్ణయంపై తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాల్సింది భారతీయ జూట్ మిల్లుల సంఘం(ఐజెఎంఏ) రాష్త్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో కార్మికులను ఉద్యోగులను, రైతులు, వ్యవసాయకార్మికులను మిల్లు యాజమాన్యం మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేసిందని కార్మిక సంఘ నాయకులు సింఘానియా ఆరోపించారు. డీమానిటైషన్ కారణంగా దాదాపు 95శాతం నగదురూపంలో వేతనాలు పొందే కార్మికులు ప్రభావితమైనట్టు స్థానిక పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో జనపనార మిల్లులకు చెందిన 2.5 లక్షల కార్మికులు సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపాయి. -
భారీగా మూతపడుతున్న నైక్ స్టోర్స్
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ నైక్ దేశంలో భారీ ఎత్తున తన దుకాణాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించిందట. ఇటీవలి భారీ నష్టాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ మేకర్ అమెరికాకు చెందిన నైక్ దాదాపు 35శాతం స్టోర్లను మూసివేస్తున్నట్టు సమాచారం. భాగస్వాముల సంఖ్యను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానించారు. గతంలో 20 మందిగా పార్టనర్ల సంఖ్యను రెండునుంచి మూడుకు తగ్గించే యోచనలో ఉందని తెలిపారు. పెట్టుబడులపై క్షీణించిన ఆదాయం, తప్పుడు మార్కెటింగ్ విధానాలే సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయని, రీటైల్ వ్యాపార విస్తరణ ప్లాన్ కూడా విఫలమైన కారణంగా దుకాణాల మూసివేతకు దారితీసిందని మరో పరిశ్రమ పెద్ద అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్ పై సంవత్సరానికి దాదాపు 60 కోట్లకు పైగా వెచ్చించే నైక్...భారత క్రీకెట్ దిగ్గజాలకు కిట్ల స్పాన్సరింగ్ విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్టు సమాచారం. కాగా నైక్ ప్రస్తుతం సుమారు 200 దుకాణాలను నిర్వహిస్తున్న నైక్ అడిడాస్ , రీ బ్యాక్, ప్యూమా లాంటి ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా ప్రీమియం షూస్, దుస్తులు తదితర అమ్మకాల్లో పేరు గడించిన సంగతి తెలిసిందే.