కోలకతా: ఒక పక్క ప్రధానమంత్రి నరనేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెద్ద యుద్ధమే చేస్తుండగా మరోవైపు రాష్ట్రంలో వేలమంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో హౌరా జిల్లాలోని జనపనార మిల్లును తాత్కాలికంగా మూత పడింది. పెద్ద నోట్ల రద్దుతో రాజధాని నగరం కోలకతాకు 7 కిలోమీటర్ల దూరంలో గూసూరి లో ఉన్న శ్రీ హనుమాన జూట్ మిల్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోకార్మికులకు జీతాలు చెల్లించలేక తాత్కాలికంగా జూట్ మిల్లును మూసివేస్తున్నట్టు శ్రీ హనుమాన జూట్ మిల్లు యాజమాన్యం ప్రకటింది. దీంతోపాటు దాదాపు 2500 మంది ఉద్యోగులను పనిలో నుంచి తొలగిచింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. కార్మికుల జనరల్ బాడీ మీటింగ్ లో ఈనిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. డీమానిటైజేషన్ తరువాత కార్మికుల ఆందోళనలు, చెల రేగిన హింస కారణంగా ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని తెలిపింది. ప్రతి షిప్టులో తో కార్మికుల హాజరు శాతం బాగా తగ్గిందని నోటీసులో పేర్కొంది. డిశెంబర్ 5నుంచి, తదుపరి ఆదేశాల వరకు ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
చిన్న వ్యాపార సంస్థలు మూతతో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాలు కోతకు దారితీస్తోంది. జిల్లాలోని అనేక వ్యాపార యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయని, ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే మరింత ఈ బ్లడ్ బాత్ ఇక ముందు కూడా కొనసాగునుందని సహకారం మంత్రి, తృణమూల్ నేత అరుప్ రాయ్ వ్యాఖ్యానించారు.
దీంతో కార్మిక వర్గంలో ఆందోళన చెలరేగింది. వందలాది మంది ఉద్యమానికి దిగారు. అయితే యాజమాన్యం నిర్ణయంపై తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాల్సింది భారతీయ జూట్ మిల్లుల సంఘం(ఐజెఎంఏ) రాష్త్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో కార్మికులను ఉద్యోగులను, రైతులు, వ్యవసాయకార్మికులను మిల్లు యాజమాన్యం మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేసిందని కార్మిక సంఘ నాయకులు సింఘానియా ఆరోపించారు. డీమానిటైషన్ కారణంగా దాదాపు 95శాతం నగదురూపంలో వేతనాలు పొందే కార్మికులు ప్రభావితమైనట్టు స్థానిక పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో జనపనార మిల్లులకు చెందిన 2.5 లక్షల కార్మికులు సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపాయి.
మిల్లు మూత: వేలమంది ఉద్యోగుల తొలగింపు
Published Wed, Dec 7 2016 12:25 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
Advertisement
Advertisement