Jute mill
-
నెల్లిమర్ల జూట్‌మిల్ మళ్లీ మూత
నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. జూట్‌మిల్‌లో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడిసరుకు కొరత పేరిట యాజమాన్యం మిల్‌ను అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన చెందుతున్నాయి. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదని కార్మికులు చెబుతున్నారు. చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లకుండాపోతున్నాయని రిటైర్డ్ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్‌ను తెరిపించే ఏర్పాట్లు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.కార్మికులకు న్యాయం చేయాలిరిటైర్డ్ కార్మికులకు 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదు. వారికి చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కులు చెల్లకుండా పోతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కర్మాగారం తెరిపించే ఏర్పాట్లు చేయాలి. – కిల్లంపల్లి రామారావు, సీపీఎం నాయకుడు, నెల్లిమర్ల -
హృదయాలను కదిలిస్తున్న జ్యూట్ మిల్లు కార్మికుల ఆవేదన
-
దారుణం: సరదా కోసం శరీరంలోకి గాలి నింపి చంపేశారు!
కోల్‌కతా: సరదా కోసం కొంతమంది విపరీతబుద్ధితో ప్రవర్తిస్తూ.. ఎదుటివారి ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాక్షస బుద్ధి కలిగిన కొందరు.. ఓ వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలి నింపుతూ మరణించేలా చేశారు. వివరాల్లో వెళ్లితే.. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ పనిచేస్తున్నాడు. నవంబర్ 16న నైట్ డ్యూటీ చేయడానికి రెహమత్ మిల్లుకు వెళ్లాడు. రెహమత్‌ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. నిస్సహాయుడు అయిన రెహమత్ తనను వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడ్డా విడువకుండా వారు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో హుగ్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షిణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాలి పంపు ఒత్తిడి వల్ల అతని శరీరంలోని కాలయం పూర్తిగా పాడైపోవటంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. అతనితో పాటు మిల్లులో పని చేసే.. షాజాదా ఖాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని రెహమత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాజాద్ జూట్ మిల్లును శుభ్రం చేసే ఎయిర్ పంప్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెహమత్ మృతికి బాధ్యతవహిస్తూ.. నష్టం పరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
తెలంగాణలో జూట్ మిల్లు, ప్రభుత్వంతో గ్లోస్టర్ సంస్థ ఒప్పందం
కోల్‌కతా: Gloster Limited signs MoU.జూట్ తయారీ కంపెనీ గ్లోస్టర్ లిమిటెడ్ పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో కొత్తగా జూట్ మిల్లులను ఏర్పాటు చేయనుట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023)కల్లా రూ. 630 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హేమంత్ బంగూర్ తాజాగా వెల్లడించారు. ఈ నిధులతో రెండు రాష్ట్రాలలోనూ జూట్ మిల్లులను నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. తద్వారా కంపెనీ ఆదాయం 150 శాతం పుంజుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో జనపనార(జూట్) ఉత్పత్తి తగ్గుతుండటం, పలు మిల్లులు ఆధునికతకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వంటి అంశాల నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన ఫైబర్‌కు డిమాండ్ పట్ల బంగూర్ ఆశావహంగా స్పందించారు. ఇప్పటికే కొత్త ప్లాంటు ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో మరింత విస్తరించనున్నట్లు తెలియజేశారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో జూట్ మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 120 టన్నులు.. హౌరా జిల్లాలో గల రెండు యూనిట్లకు సమీపాన రోజుకి 90 టన్నుల సామర్థ్యంతో కొత్త మిల్లును ఏర్పాటు చేస్తున్నట్లు బంగూర్ పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌కల్లా బెంగాల్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో రోజుకి 120 టన్నుల సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 2023కల్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే వీలున్నట్లు అంచనా వేశారు. లాభదాయక ప్రోత్సాహకాలు, హామీగల మార్కెట్ తదితరాలను తెలంగాణ ఆఫర్ చేస్తున్నట్లు తెలియజేశారు. రానున్న రెండు దశాబ్దాలపాటు ఉత్పత్తిని ప్రభుత్వం తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ముడిసరుకుల లభ్యతకు వీలుగా ప్రభుత్వం జూట్ సేద్యం అభివద్ధికి మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. -
మూడు జిల్లాల్లో జూట్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూట్ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ కంపెనీలు అంగీకరించి శుక్రవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో గ్లోస్టర్ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు ఐటీ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కేటీఆర్ మట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు జూట్ పరిశ్రమ లేదని, ఈ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూట్ పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ మూడు పరిశ్రమలతోపాటు మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. జనపనార పంటలకు ప్రోత్సాహం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 3.20 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచే రూ. 49.26 నుంచి రూ. 61.78కి ఒక్కో గన్నీ బ్యాగును సేకరిస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ కోసం రూ. 2.36 వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త జూట్ మిల్లుల ఏర్పాటుతో రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు నిధుల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. గన్నీలతోపాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు, ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అన్నారు. -
జూట్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం
టెక్కలి రూరల్ (కోటబొమ్మాళి): మండలంలోని బజీరుపేట కూడలి సమీపంలోని శ్రీసాయి హర్షవర్ధన్ జూట్ కర్మాగారంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం షిఫ్టునకు హాజరైన వారు ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా యంత్రం నుంచి మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో కార్మికులకు ఊపిరాడక హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా మంటలు ఎగసిపడి జూట్ నిల్వలు దగ్ధమయ్యాయి. దాదాపు 500 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో వారంతా కొంత సరుకును పట్టుకుని బయటకు పరుగులు తీశారు. నష్టం రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం అగ్ని మాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలు సాయంత్రానికి 70 శాతం వరకు మంటలను అదుపు చేశాయి. జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్ కృష్ణవర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని వివరించారు. -
చిట్టివలస జ్యూట్‌మిల్ కార్మికుల సమస్య పరిష్కారం
-
నెల రోజుల్లేనే జగన్ సమస్యను పరిష్కరించారు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే చిట్టివలస జ్యూట్ మిల్ సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉందన్నారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా చిట్టివలస జ్యూట్ మిల్ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ప్రభుత్వం జ్యూట్ మిల్‌ను తెరిపించడానికి ప్రయత్నించినా.. పరిశ్రమ నిర్వహించడానికి యాజమాన్యం అంగీకరించలేదని ఆరోపించారు. చివరకూ ప్రభుత్వ చొరవతో కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. శాశ్వత, రిటైర్మెంట్, అప్రెంటీస్లకు కలుపుకుని మొత్తం 6 వేల మందికి సుమారు రూ. 24 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఏడాదిలోగా చెల్లించడానికి జ్యూట్ మిల్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ఏ కార్మికునికి కష్టం కలగకుండా చూడాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు శ్రీనివాసరావు. -
రోడ్డున పడ్డ 2500 మంది కార్మికులు
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరం పట్టాభిపురంలోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేయడం వల్ల 2500 మంది కార్మికులు రోడ్డు పడ్డారని, మిల్లు తిరిగి ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైఎస్సార్ సీపీ నాయకుడు, జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మిలతో నాయకులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూట్ మిల్లు లాకౌట్ చేసి వేలాది మంది కార్మికుల పొట్టకొట్టిన యాజమాన్యానికి గత ప్రభుత్వం కొమ్ముకాసిందని చెప్పారు. 1994లో బీఐఎఫ్ఆర్ పద్ధతిలో 40 శాతం కార్మికుల వాటా, 60 శాతం యాజమాన్యం వాటా కింద మిల్లును నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. 40 శాతం కార్మికుల వాటను ప్రభుత్వమే సమకూర్చేలా ఒప్పందం జరిగిందన్నారు. 2014 వరకూ మిల్లు సజావుగా సాగిందని, ఉత్తమ మేనేజ్మెంట్ అవార్డును సైతం ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం తీసుకుందన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడటంతో భూముల విలువ అమాంతం పెరగడంతో మిల్లు భూములను రియల్టర్లకు విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగంగా 2015 మే 12న మిల్లు భూములను యాజమన్యం విక్రయించగా, అదే సంవత్సరం జూలై 4న యాజమాన్యం మిల్లు లాకౌట్ చేసిందని వివరించారు. బీఐఎఫ్ఆర్ పద్ధతిలో మిల్లు నిర్వహించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనేక రాయితీలిచ్చిందని వెల్లడించారు. కానీ స్వప్రయోజనాల కోసం యాజమాన్యం మిల్లును లాకౌట్ చేసిందన్నారు. సమగ్ర విచారణ చేయిస్తాం.. మిల్లు లాకౌట్ చేసి యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టిన విధానాన్ని నాయకులు వివరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేయించి నివేదికలు తెప్పించుకుని నాయకులతో మళ్లీ సమావేశం నిర్వíßహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, జూట్ మిల్లు మూత పడటంతో రోడ్డున పడ్డ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు పాండు, సాంబ, మోసే, వైఎస్సార్సీపీ నాయకులు షౌకత్, తోట ఆంజనేయులు, పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు. -
ఆశలు అమ్మేస్తున్నారు
-
చిట్టివలస జూట్‌మిల్లును తెరిపించాలి
-
మంత్రి పదవి వచ్చింది కానీ..
బొబ్బిలి: బొబ్బిలిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతపడి నాలుగేళ్లయింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్మికులు ఆర్వీఎస్కే రంగారావుకు మిల్లును తెరిపించాలని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. తెరిపించే ప్రయత్నం అటుంచితే ఆయన వైఎస్సార్ సీపీని వీడి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత బొబ్బిలిలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో జూట్ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి ఒకటిన్నరేళ్లు అయినా నేటికీ మిల్లును తెరిపించలేదు. కనీసం కార్మికుల వేతనాలు ఇప్పించలేదు. 2013 జనవరి 23న మూసివేత.. బొబ్బిలి చుట్టు పక్కల మండలాల్లోని గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని బొబ్బిలి వచ్చిన కార్మికుల కుటుంబాలను చిదిమేస్తూ శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లు 2015 జనవరి 23న మూసేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రులకు తమ బతుకులు వీధిన పడ్డాయంటూ చెప్పుకున్నా కార్మికుల గోడును పట్టించుకునే వారే లేరు. ఈ మిల్లులో 2,300 మంది కార్మికులకు పీఎఫ్ రూ. 2.60 కోట్లు, గ్రాట్యూటి రూ.1.50 కోట్లు, ఈఎస్ఐ రూ.1.80 కోట్లు, బోనస్ రూ.50 లక్షలు, కార్మికుల ఒకరోజు వేతనం రూ.3 లక్షలు, ఎల్ఐసీ రెన్యువల్ రూ.4 లక్షలు, కార్మికుల డెత్çఫండ్ రూ.లక్ష బకాయిలు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు యాజమాన్యం పత్తా లేకుండా పోయింది. సదరు యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి మిల్లును తెరిపించాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని కార్మికులు గొల్లుమంటున్నారు. కార్మికుల కష్టం నుంచి వసూలు చేసిన ఈఎస్ఈ సొమ్ము కూడా యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల వారు ఈఎస్ఐకి కూడా అర్హులు కాకపోవడంతో అప్పులు చేసి మరీ బయట వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 35 కార్మికుల మరణం.. మిల్లు మూసేసిన తర్వాత నాలుగు మండలాలలో ఉన్న కార్మికులు దాదాపు 35 మంది చనిపోయారు. వారి బకాయిలు రాకపోవడంతో దిగాలుగా మంచం పట్టి రోగులుగా మారారు. ఈఎస్ఐకి అర్హులు కాకపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పలువురు కార్మికులు వలసబాట పోయి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జీఎస్‌ఎస్‌కే శ్రీనివాసరావును వివరణ కోరగా నవంబర్ 6న రాష్ట్రస్థాయిలో ఈ మిల్లుపై అమరావతిలో చర్చలు జరుగుతాయని తెలిపారు. మంత్రి హామీ ఏమైనట్టో..? గతంలో అనేకమార్లు సీఎంను, కార్మికశాఖా మంత్రిని, స్థానిక మంత్రి ని, అధికారులను కలిశా ం. ఎవరూ మా సమస్యలపై స్పందించ లేదు. ఇక్కడి ఎమ్మెల్యే మంత్రి అయ్యాక పెట్టిన సభలో ఆరు నెలల్లో మిల్లును తెరిపిస్తామన్నారు. సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. –వి.శేషగిరిరావు, కార్మిక సంఘం అధ్యక్షుడు, లక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు, బొబ్బిలి. నరకయాతన అనుభవిస్తున్నాం.. నా భర్త పేరు బసవ రమణ. ఇక్కడి మిల్లులో పనిచేస్తూ చనిపోయాడు. ఆయనకు కంపెనీ నుంచి రూ.3.5 లక్షలు అందాలి. అది రాలేదు. పింఛన్ రావడం లేదు. మిల్లు మూసేయడంతో íపిల్లలను కూలి పనులు చేస్తూ పోషిస్తున్నా. కుమార్తె డిగ్రీ చదువుతుంది. కుమారుడు ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాడు. భర్త జీవించినపుడు సంతోషంగా ఉన్నాం. ఆయన మరణం తర్వాత నరకయాతన అనుభవిస్తున్నాం. – బసవ కళావతి, మరణించిన కార్మికుడి భార్య.41 ఏళ్ల సర్వీసు.. మిల్లులో రూ.3 జీతం నుంచి పనిచేశా. 41 ఏళ్ల సర్వీసు ఉంది. చివరిలో యాజమాన్యం తీరు వల్ల నానా అవస్థలు పడుతున్నాం. స్థానికంగా మంత్రి ఉన్నా మా సమçస్య పరిష్కారం కావడం లేదు. హక్కుల కోసం మేం రోడ్డెక్కాల్సి రావడం దారుణం. – బొంతలకోటి సత్యం, కార్మికుడు, కింతలివానిపేట. -
వైఎస్ జగన్‌ను కలసిన జూట్‌మిల్ కార్మికులు
-
చిట్టివలస జూట్ మిల్‌ను మూసేందుకు ప్రభుత్వం కుట్ర
-
కార్మికులపై ఖాకీల జులుం
సాక్షి, గుంటూరు: అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు శాంతియుతంగా చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహార దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేసి మూడేళ్లు గడిచినా పట్టించుకోని యాజమాన్య, ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరు నగరం పట్టాభిపురంలోని జూట్ మిల్లు వద్ద బుధవారం కార్మికులు చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహార దీక్షను బుధవారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. ఏఎస్పీ వైటీ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. దీక్షలో ఉన్న కార్మికులను అరెస్టు చేశారు. కార్మిక, వామపక్షాల నేతలను వాహనాల్లో ఎక్కించుకుని నగరంలోని పోలీస్స్టేషన్లకు తరలించారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. శాంతియుతంగా దీక్ష చేసుకుంటున్న వారిపై పోలీసులు విరుచుకుపడి దీక్షను భగ్నం చేయడంపై కార్మికులు మండిపడ్డారు. పోలీసుల జులుం నశించాలి, కార్మిక వ్యతిరేక టీడీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కార్మికులు, వామపక్ష నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో కార్మికులకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం 2015 అక్టోబర్ 2వ తేదీన గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా భజరంగ్ జూట్ మిల్లు అక్రమ లాకౌట్‌ను ఎత్తివేసి, మిల్లును ప్రారంభిస్తానని వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది జరిగి మూడేళ్లయినా పట్టించుకోవడం లేదని మిల్లు కార్మికులు మండిపడ్డారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, యాజమాన్యంతో లాలూచి పడి పట్టించుకోవడం లేదని, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పిరెడ్డి గృహ నిర్బంధం.. నేతల పరామర్శ తొలి నుంచీ కార్మికులకు మద్దతుగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు, జూట్ మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని దీక్షకు సంఘీభావం తెలుపనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన నివసిస్తున్న గోల్డెన్ హోమ్స్ అపార్టుమెంట్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేశారు. ఈ విషయం తెలియగానే వైఎస్సార్సీపీ శ్రేణులు, పార్టీనేతలు, జూట్ మిల్లు కార్మికులు పెద్ద సంఖ్యలో గోల్డెన్ హోమ్స్ అపార్టుమెంట్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి, తమ నేతను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. బుధవారం రాత్రి వరకూ అప్పిరెడ్డి గృహ నిర్బంధం కొనసాగింది. కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి భవన్నారాయణ తదితర వామపక్ష నేతలతో పాటు.. వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ నేతలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర హెనీక్రిస్టీనా, నందిగం సురేష్ తదితరులు అప్పిరెడ్డిని పరామర్శించారు. కాగా, వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు అప్పిరెడ్డిని ఫోన్లో పరామర్శించారు. -
మిల్లు మూత: వేలమంది ఉద్యోగుల తొలగింపు
కోలకతా: ఒక పక్క ప్రధానమంత్రి నరనేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెద్ద యుద్ధమే చేస్తుండగా మరోవైపు రాష్ట్రంలో వేలమంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో హౌరా జిల్లాలోని జనపనార మిల్లును తాత్కాలికంగా మూత పడింది. పెద్ద నోట్ల రద్దుతో రాజధాని నగరం కోలకతాకు 7 కిలోమీటర్ల దూరంలో గూసూరి లో ఉన్న శ్రీ హనుమాన జూట్ మిల్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోకార్మికులకు జీతాలు చెల్లించలేక తాత్కాలికంగా జూట్ మిల్లును మూసివేస్తున్నట్టు శ్రీ హనుమాన జూట్ మిల్లు యాజమాన్యం ప్రకటింది. దీంతోపాటు దాదాపు 2500 మంది ఉద్యోగులను పనిలో నుంచి తొలగిచింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. కార్మికుల జనరల్ బాడీ మీటింగ్ లో ఈనిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. డీమానిటైజేషన్ తరువాత కార్మికుల ఆందోళనలు, చెల రేగిన హింస కారణంగా ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని తెలిపింది. ప్రతి షిప్టులో తో కార్మికుల హాజరు శాతం బాగా తగ్గిందని నోటీసులో పేర్కొంది. డిశెంబర్ 5నుంచి, తదుపరి ఆదేశాల వరకు ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. చిన్న వ్యాపార సంస్థలు మూతతో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాలు కోతకు దారితీస్తోంది. జిల్లాలోని అనేక వ్యాపార యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయని, ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే మరింత ఈ బ్లడ్ బాత్ ఇక ముందు కూడా కొనసాగునుందని సహకారం మంత్రి, తృణమూల్ నేత అరుప్ రాయ్ వ్యాఖ్యానించారు. దీంతో కార్మిక వర్గంలో ఆందోళన చెలరేగింది. వందలాది మంది ఉద్యమానికి దిగారు. అయితే యాజమాన్యం నిర్ణయంపై తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాల్సింది భారతీయ జూట్ మిల్లుల సంఘం(ఐజెఎంఏ) రాష్త్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో కార్మికులను ఉద్యోగులను, రైతులు, వ్యవసాయకార్మికులను మిల్లు యాజమాన్యం మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేసిందని కార్మిక సంఘ నాయకులు సింఘానియా ఆరోపించారు. డీమానిటైషన్ కారణంగా దాదాపు 95శాతం నగదురూపంలో వేతనాలు పొందే కార్మికులు ప్రభావితమైనట్టు స్థానిక పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో జనపనార మిల్లులకు చెందిన 2.5 లక్షల కార్మికులు సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపాయి. -
జూట్ మిల్లు లాకౌట్: కార్మికుల ఆందోళన
సాలూరు రూరల్: విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్లోని జ్యూట్‌మిల్లు సోమవారం ఉదయం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సుమారు 1,550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ 900 మంది కార్మికులు ట్రైనీలుగా పనిచేస్తున్నారు. వారిలో 600 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. -
లేఆఫ్ ఎత్తివేయాలని కార్మికుల ధర్నా
కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని జూట్ మిల్లు లేఆఫ్ ప్రకటించడంతో కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. లేఆఫ్ ఎత్తివేయాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై తహశీల్దారు చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో 60 మంది కార్మికులు పాల్గొన్నారు. -
గుంటూరులో జూట్ మిల్లు లాకౌట్
-
మిల్లు మూత బతుకు కోత