![Report says Xiaomi Shuts Financial Services Business In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/28/Xiaomi.jpg.webp?itok=8_7bhPMI)
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా షావోమి Mi Pay, Mi క్రెడిట్ యాప్‌లను స్థానిక ప్లే స్టోర్, అలాగే తన సొంత యాప్ స్టోర్ నుండి తీసివేసిందని టెక్ క్రంచ్ శుక్రవారం నివేదించింది. (Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం)
ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, వినియోగదారులను బిల్లు చెల్లింపులు, నగదు బదిలీల సేవలకు సంబంధించి యాప్, రెగ్యులేటరీ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన Mi Pay ఇకపై అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే దీనిపై షావోమి కానీ, ఎన్‌పీసీఐ కానీ అధికారింగా ఇంకా స్పందించ లేదు.
కాగా భారతదేశంలో భారీ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది షావోమి. దీనికి సంబంధించి ఈడీ దాడుల్లో 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీం చేసుకుంది. దీన్ని ఎత్తివేయడానికి భారతీయ కోర్టు ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment