financial App
-
షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా షావోమి Mi Pay, Mi క్రెడిట్ యాప్‌లను స్థానిక ప్లే స్టోర్, అలాగే తన సొంత యాప్ స్టోర్ నుండి తీసివేసిందని టెక్ క్రంచ్ శుక్రవారం నివేదించింది. (Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం) ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, వినియోగదారులను బిల్లు చెల్లింపులు, నగదు బదిలీల సేవలకు సంబంధించి యాప్, రెగ్యులేటరీ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన Mi Pay ఇకపై అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే దీనిపై షావోమి కానీ, ఎన్పీసీఐ కానీ అధికారింగా ఇంకా స్పందించ లేదు. కాగా భారతదేశంలో భారీ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది షావోమి. దీనికి సంబంధించి ఈడీ దాడుల్లో 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీం చేసుకుంది. దీన్ని ఎత్తివేయడానికి భారతీయ కోర్టు ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. -
గూగుల్ వార్నింగ్, ప్రమాదంలో స్లైస్ వినియోగదారులు!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'స్లైస్' యాప్ వినియోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. కస్టమర్ల డేటాను స్లైస్ దొంగిలిస్తుందంటూ టెక్ దిగ్గజం గూగుల్ ఆరోపించింది. అంతేకాదు యాప్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఫోన్లలో నుంచి అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచించింది. క్రెడిట్ కార్డ్‌లకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఫిన్‌టెక్ కంపెనీ స్లైస్ యాప్ వినియోగదారుల పర్సనల్ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని గూగుల్ హెచ్చరించింది. వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న టూల్‌ను గుర్తించేలా గూగుల్‌ప్లే ప్రొటెక్ట్ టూల్ పనిచేస్తుందని,ఆ టూల్.. స్లైస్ వినియోగదారుల డేటాను దొంగిలించే అవకాశం ఉందని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యక్తిగత డేటా స్పై స్లైస్ పంపిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా యూజర్ని ప్లే ప్రొటెక్ట్ పేజీకి తీసుకెళుతుంది. ఇది మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు లేదా కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను స్పైస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక హానికరమైన అప్లికేషన్ ఉన్నట్లు గుర్తించామని గుగుల్ చెప్పింది. యాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేయాలని యూజర్లకు సిఫారసు చేసింది. స్లైస్ ఏం చెబుతుంది గూగుల్ గుర్తించిన సమస్యను పరిష్కరిస్తున్నట్లు స్లైస్ ట్విట్ చేసింది. 'నిన్న సాయంత్రం- మా ఆండ్రాయిడ్ అప్ డేట్ ప్లే స్టోర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మేం దానిపై దర్యాప్తు చేసి గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తామంటూ ట్విట్లో పేర్కొంది. అంతేకాదు 1శాతం మంది యాప్ వినియోగదారులు పాత వెర్షన్లో ఉన్నారని, వాళ్లు లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలని స్లైస్ కోరింది. -
చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్(డిఫై) సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు. చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే బాడ్జర్ డీఏఓ యాప్‌ను హ్యాక్ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది. Here is the current whereabouts as well as the total loss: $120.3M (with ~2.1k BTC + 151 ETH) @BadgerDAO pic.twitter.com/fJ4hJcMWTq — PeckShield Inc. (@peckshield) December 2, 2021 పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. Badger has received reports of unauthorized withdrawals of user funds. As Badger engineers investigate this, all smart contracts have been paused to prevent further withdrawals. Our investigation is ongoing and we will release further information as soon as possible. — ₿adgerDAO 🦡 (@BadgerDAO) December 2, 2021 బాడ్జర్ డీఏఓ బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్ కాయిన్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు. (చదవండి: పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..) -
చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. పన్నెండు వేల కోట్లు హాంఫట్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి భారీ షాక్ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 12 వేల కోట్లు పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలినెట్‌వర్క్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. తిరిగి ఇచ్చేయండి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్ అయిన పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. భిన్నాభిప్రాయాలు పాలినెట్‌వర్క్ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్ చైయిన్ టెక్నాలజీని క్రాక్ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర్ల మేథస్సు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు. Hope you will transfer assets to addresses below: ETH: 0x71Fb9dB587F6d47Ac8192Cd76110E05B8fd2142f BSC: 0xEEBb0c4a5017bEd8079B88F35528eF2c722b31fc Polygon: 0xA4b291Ed1220310d3120f515B5B7AccaecD66F17 pic.twitter.com/mKlBQU4a1B — Poly Network (@PolyNetwork2) August 11, 2021 -
యాప్ కీ కహానీ...
స్టాక్ ఎడ్జ్... ‘స్టాక్ ఎడ్జ్’ అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్డ్ ఫైనాన్షియల్ యాప్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ యాప్ సాయంతో ప్రధానంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. విశ్లేషణలు, అలర్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్.. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లావాదేవీలకు సంబంధించి సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి తోడ్పాటునందిస్తుంది. ‘స్టాక్ ఎడ్జ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ♦ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు. ♦ వాచ్ లిస్ట్‌కు స్టాక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో మల్టిపుల్ వాచ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ♦ ప్రైస్ టార్గెట్స్‌ను సెట్ చేసుకొని, అలర్ట్స్‌ను పొందొచ్చు. ♦ బల్క్/బ్లాక్ డీల్స్, ఎఫ్ఐఐ కార్యకలాపాలు సహా పలు రంగాల స్టాక్స్ పనితీరు ఎలా ఉందో గమనించవచ్చు. ♦ మార్కెట్ వార్తలు, అప్డేట్స్, కంపెనీ ఫలితాలు, ఒప్పందాలు వంటి తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ♦ స్టాక్స్ హెచ్చుతగ్గులను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూడొచ్చు. ♦ స్కాన్ విభాగంలోని టెక్నికల్, ప్రైజ్, వ్యాల్యుమ్ అండ్ డెలివరీ, ఫ్యూచర్ వంటి పలు రకాల ఆప్షన్ల ద్వారా స్టాక్స్ కదలికలను నిశితంగా గమనించొచ్చు. -
యాప్‌కి కహానీ..
ఎమ్ట్రాకర్.. సుందరం వయసు 26 ఏళ్లు. ఈ మధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. నెల జీతం వస్తుంది. కానీ ఆ వచ్చిన జీతం వారం రోజులు కూడా జేబులో నిలవడం లేదు. డబ్బులు అలా చేతిలోకి వచ్చి, ఇలా మాయమైనట్లు అవుతోంది. ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకోవడం ఎలా నో తెలియక సతమతమౌతున్నాడు. అలాంటి సమయంలో అతనికి స్నేహితుడి సలహామేరకు ‘ఎమ్ట్రాకర్-మనీ అండ్ ట్యాక్స్ మేనేజర్’ అనే ఫైనాన్షియల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించడం ప్రారంభించాడు. దీంతో అతను తన ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకున్నాడు. ప్రత్యేకతలు.. మనీ మేనేజర్: ఇక్కడ మనం ఏ ఏ వాటిపై ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నామో ఆ వివరాలను యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్లను ఇది ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి ఆ సమాచారాన్ని ఆదాయవ్యయాలకు యాడ్ చేస్తుంది. ఇలా నెల వారి ఆదాయ వ్యయాలను ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం వీలవుతుంది. డాక్యుమెంట్ మేనేజర్: ఆర్థిక వ్యవహారాలకు సం బంధించిన పలు డాక్యుమెంట్లను, ఖర్చులకు చెందిన బిల్లులను అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్, ఆఫీస్ చలానా, బిల్లులు, పార్కింగ్ టికెట్స్, టోల్స్, ఐడీ డాక్యుమెంట్స్లను ఆయా కేటగిరిలకు జత చేసుకోవచ్చు. ⇒ మొబైల్, క్రెడిట్ కార్డులు, యుటిలిటీ బిల్స్ వంటి తదితర వాటికి సంబంధించిన అలర్ట్స్‌ను పెట్టుకోవచ్చు. ⇒ ఓటీపీ, క్రెడిట్ కార్డు నెంబర్స్, బ్యాంక్ అకౌం ట్స్ వంటి విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయబోమనేది యాప్ డెవలపర్ల మాట. అలాగే భద్రతకు గ్యారెంటీ ఇస్తున్నారు.