యాప్కి కహానీ..
ఎమ్‌ట్రాకర్..
సుందరం వయసు 26 ఏళ్లు. ఈ మధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. నెల జీతం వస్తుంది. కానీ ఆ వచ్చిన జీతం వారం రోజులు కూడా జేబులో నిలవడం లేదు. డబ్బులు అలా చేతిలోకి వచ్చి, ఇలా మాయమైనట్లు అవుతోంది. ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకోవడం ఎలా నో తెలియక సతమతమౌతున్నాడు. అలాంటి సమయంలో అతనికి స్నేహితుడి సలహామేరకు ‘ఎమ్‌ట్రాకర్-మనీ అండ్ ట్యాక్స్ మేనేజర్’ అనే ఫైనాన్షియల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడం ప్రారంభించాడు. దీంతో అతను తన ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకున్నాడు.
ప్రత్యేకతలు..
మనీ మేనేజర్: ఇక్కడ మనం ఏ ఏ వాటిపై ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నామో ఆ వివరాలను యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లను ఇది ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి ఆ సమాచారాన్ని ఆదాయవ్యయాలకు యాడ్ చేస్తుంది. ఇలా నెల వారి ఆదాయ వ్యయాలను ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం వీలవుతుంది.
డాక్యుమెంట్ మేనేజర్: ఆర్థిక వ్యవహారాలకు సం బంధించిన పలు డాక్యుమెంట్లను, ఖర్చులకు చెందిన బిల్లులను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్, ఆఫీస్ చలానా, బిల్లులు, పార్కింగ్ టికెట్స్, టోల్స్, ఐడీ డాక్యుమెంట్స్‌లను ఆయా కేటగిరిలకు జత చేసుకోవచ్చు.
⇒ మొబైల్, క్రెడిట్ కార్డులు, యుటిలిటీ బిల్స్ వంటి తదితర వాటికి సంబంధించిన అలర్ట్స్‌ను పెట్టుకోవచ్చు.
⇒ ఓటీపీ, క్రెడిట్ కార్డు నెంబర్స్, బ్యాంక్ అకౌం ట్స్ వంటి విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయబోమనేది యాప్ డెవలపర్ల మాట. అలాగే భద్రతకు గ్యారెంటీ ఇస్తున్నారు.