యాప్ కీ కహానీ...
స్టాక్ ఎడ్జ్...
‘స్టాక్ ఎడ్జ్’ అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్‌డ్ ఫైనాన్షియల్ యాప్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ యాప్ సాయంతో ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. విశ్లేషణలు, అలర్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్.. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లావాదేవీలకు సంబంధించి సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి తోడ్పాటునందిస్తుంది. ‘స్టాక్ ఎడ్జ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
♦ ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు.
♦ వాచ్ లిస్ట్‌కు స్టాక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో మల్టిపుల్ వాచ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
♦ ప్రైస్ టార్గెట్స్‌ను సెట్ చేసుకొని, అలర్ట్స్‌ను పొందొచ్చు.
♦ బల్క్/బ్లాక్ డీల్స్, ఎఫ్‌ఐఐ కార్యకలాపాలు సహా పలు రంగాల స్టాక్స్ పనితీరు ఎలా ఉందో గమనించవచ్చు.
♦ మార్కెట్ వార్తలు, అప్‌డేట్స్, కంపెనీ ఫలితాలు, ఒప్పందాలు వంటి తదితర విషయాలను తెలుసుకోవచ్చు.
♦ స్టాక్స్ హెచ్చుతగ్గులను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూడొచ్చు.
♦ స్కాన్ విభాగంలోని టెక్నికల్, ప్రైజ్, వ్యాల్యుమ్ అండ్ డెలివరీ, ఫ్యూచర్ వంటి పలు రకాల ఆప్షన్ల ద్వారా స్టాక్స్ కదలికలను నిశితంగా గమనించొచ్చు.