
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా పులి వచ్చి ఈడ్చుకెళ్లింది. అనంతరం అతడ్ని సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మృతుడ్ని ఖతారి గ్రామానికి చెందిన నఫీస్‌గా గుర్తించారు. శనివారం సాయం కాలం అతడు స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు ఊరిబయటకు వెళ్లాడు. కాలువ బ్రిడ్జ్ పక్కన కూర్చొని మందుతాగుతున్నారు. ఇంతలో ఓ పులి అక్కడకు వచ్చింది. నఫీస్‌ను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఇది చూసి స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు నఫీస్ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం అతని మృతదేహం సగ భాగం లభ్యమైంది. పులి అతడ్ని సగం తిని వదిలేసింది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు.
చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?