ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురు మృతి | Violence Takes Place In Uttarakhand Haldwani | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురు మృతి

Published Fri, Feb 9 2024 2:53 PM | Last Updated on Fri, Feb 9 2024 3:37 PM

Violence Takes Place In Uttarakhand Haldwani - Sakshi

డెహ్రాడూన్‌: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుఉకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దాడితో హింస చెలరేగి  ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. 

ఘర్షణలను అదుపు చేసేందుకు ఖర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు కూల్చివేతల కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

రాళ్లు రువ్వుతూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసంచేసి పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చిననప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. హల్ద్వానీ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ శుక్రవారం  స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి.. లైవ్‌లో మాట్లాడుతుండగానే శివసేన నేత హత్య 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement