Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే | FactCheck: Establishment Of 10778 RBKs At Village Level In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే

Published Mon, Feb 12 2024 5:11 AM

Establishment of 10778 RBKs at village level - Sakshi

సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభు­త్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వర­కు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకే­లు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవల­ను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది.

ఏపల్లెకు వెళ్లి­నా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకు­తుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడు­తుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్య­క్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..­భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది.

ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత
వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్‌ చేస్తున్నా­రు.

పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్‌ ప్రక్రి­య పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలి­తాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపా­యింట్‌మెంట్‌లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు.

ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు
వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్‌  సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్‌ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు.

సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు.

ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు 
వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు.

వీటి­లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్‌ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. 

ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్‌ చార్జీలేవీ? 
వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేం­దుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశా­రు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమా­నుల ఖాతాలకు జమ చేశారు.

మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు  బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్‌ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు.

స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు.  వైఎస్సార్‌ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు.

ఆరోపణ:  ఆర్బీకేలకు ఆదరణ కరువు
వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాది­లో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..­గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–­24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకు­న్నారు.

ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్‌ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్‌ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు.

2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామ­స్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురు­గుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement