చంద్రబాబు పాలనలో కుదేలైన గ్రామీణ వ్యవస్థ
గ్రామీణులకు అడుగడుగునా అవస్థలే
బాబు చేసిన మోసంతో ఆరి్థకంగా దెబ్బతిన్న మహిళలు, రైతులు
ఆ విషయాలన్నీ దాచి గ్రామ సభల్లో వైఎస్ జగన్ సర్కారుపై విషం
బాబు నాశనం చేసిన గ్రామాలకు పునరుజ్జీవం కల్పించిన వైఎస్ జగన్
అక్కచెల్లెమ్మలు, రైతులకు చేయూత
సచివాలయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు.. విద్య, వైద్యం అన్నీ గ్రామంలోనే అందుబాటులోకి
జగన్ చర్యలతో పెరిగిన గ్రామీణుల జీవన ప్రమాణాలు
సాక్షి, అమరావతి: 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ గ్రామాల అభివృద్ధికి, గ్రామీణుల సంక్షేమానికి చర్యలు చేపట్టని చంద్రబాబు.. నేడు వైఎస్ జగన్ హయాంలో గ్రామీణాభివృద్ధి జరగలేదనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎప్పుడూ కార్పొరేట్లు, పెత్తందారుల సంక్షేమం కోసం పనిచేసే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీఎంగా పనిచేసిన కాలంలో ఏనాడూ గ్రామాల అభివృద్ధికి కనీస ప్రయత్నం చేయలేదు.
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, విద్య, వైద్యం గురించి కనీస ఆలోచనే చేయలేదు. గ్రామాలను సర్వనాశనం చేసిన చంద్రబాబే.. ఆ విషయాలన్నింటినీ దాచిపెట్టి, గ్రామాలను అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలో కుదేలైపోయిన గ్రామాలకు పునరుజ్జీవం కల్పించి, గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధిని సాకారం చేసందే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.
ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామగ్రామంలో అభివృద్ధి జరిగింది. రైతులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ అందించిన చేయూతతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రజల అవసరాలు, ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య అన్నీ గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్వరాజ్య నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు చూపించి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
» 2019కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2019లో వైఎస్ జగన్ సీఎంగా వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఓ విప్లవం. ప్రతి గ్రామస్తుడికీ, ప్రతి ఇంటికీ వలంటీర్లు సహకారం అందించేవారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే వారు. గ్రామ సచివాలయాల్లో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ప్రజలకు అత్యంత వేగంగా సేవలందించేలా కంప్యూటర్లు, ప్రింటర్లు సహా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వీటి ద్వారా కుగ్రామాల్లో ఉండే వారు కూడా ఊరు దాటి వెళ్లకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ ఊర్లోనే అందుకొంటున్నారు.
» ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్‌లను జగన్ నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,726 కోట్లతో 8,299 హెల్త్ క్లినిక్‌లు నిరి్మస్తున్నారు. వీటిలో 14 రకాల పరీక్షలు చేస్తారు. వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు.
» విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కోసం రైతులు పడుతున్న అగచాట్లను దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రతి గ్రామలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. వీటిలో పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం, తేమ కొలిచే యంత్రాలు, విత్తనాలు, భూసార పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా రైతుల ఖర్చు, సమయం చాలా ఆదా అయ్యేవి.
» నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ సూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. అత్యా«ధునిక డిజిటల్ తరగతులు, డిజిటల్ ల్రైబరీతో పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారు.
» వైఎస్ జగన్ ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడ్డారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేవారు. మార్కెట్‌లో పంట ఉత్పత్తులు ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేసేది. దీని ద్వారా రైతు ఎప్పుడూ నష్టం చవిచూడలేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినా వెంటనే జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచేది. అదే సీజన్‌లో బీమా పరిహారం అందించేది.
ఇదీ చంద్రబాబు పాలన..
చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రజల కష్టాలు దేవుడికే ఎరుక. పంచాయతీల నిధులు గ్రామాల వరకు వచ్చేవి కావు. కనీసం తాగు నీరూ దొరికేది కాదు. పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రం లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఇచి్చన కాస్తంత పింఛనుకూ ఎంతగా ఏడిపించుకు తిన్నారో ప్రతి గ్రామీణుడికీ అనుభవమే. రెండు మూడు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా కనీసం పంచాయతీ కార్యదర్శి కూడా ఉండేవారు కాదు.
సమస్య చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసు ఒక్క రోజూ తెరిచి ఉండేది కాదు. అప్పట్లో... ఊళ్లో ఎవరికన్నా కొత్తగా పింఛను కావాలన్నా, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఏడాదికో, ఆరు నెలలకో జరిగే జన్మభూమి కార్యక్రమం కోసం ఎదురు చూడాల్సివచ్చేది. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసానికి అన్నదాతలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా కుదేలైపోయి, గ్రామాల్లో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వర్షాభావంతో పంటలు పండక, ప్రత్యామ్నాయం లేక ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment