స్ట్రెచర్‌పై రోగిని మోసుకొచ్చి...  | Villages Of Adilabad District Do Not Have Proper Road And Bridge Facilities | Sakshi
Sakshi News home page

స్ట్రెచర్‌పై రోగిని మోసుకొచ్చి... 

Published Mon, Sep 13 2021 2:26 AM | Last Updated on Mon, Sep 13 2021 2:26 AM

Villages Of Adilabad District Do Not Have Proper Road And Bridge Facilities - Sakshi

వాగులోంచి స్ట్రెచర్‌పై మోసుకొస్తున్న 108 సిబ్బంది 

సిరికొండ (బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు, వంతెన సౌకర్యాలు లేవు. కన్నాపూర్‌ తండాకు చెందిన బాలుడు రాహుల్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది గ్రామ శివారు వరకు వచ్చినా, సమీపంలో ఉన్న వాగుపై వంతెన లేకపోవడంతో వాహనం గ్రామం లోపలికి వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో ఈఎంటీ కాశీనాథ్, పైలట్‌ గోపీనాథ్‌ స్ట్రెచర్‌ తీసుకుని బాలుడి ఇంటికి వెళ్లారు. బాధితుడిని స్ట్రెచర్‌పై మోసుకొచ్చి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement