
విలీనం సంగతేంది.. కేసీఆర్‌కు కాంగ్రెస్ వర్తమానం!
‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో రాజ్యాంగ ప్రక్రియ పూర్తికావస్తోంది... తెలంగాణ ఏర్పాటైతే పార్టీని విలీనం చేస్తామని మాట ఇచ్చారు కదా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో రాజ్యాంగ ప్రక్రియ పూర్తికావస్తోంది... తెలంగాణ ఏర్పాటైతే పార్టీని విలీనం చేస్తామని మాట ఇచ్చారు కదా? విలీనం గురించి ఇప్పుడేమంటారు?’ అని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ముఖ్యుని నుంచి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు వర్తమానం అందినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్ ఈ సమాచారంపై ప్రస్తుతానికి కుటుంబసభ్యుల్లోని కొందరు ప్రజాప్రతినిధులతో మాత్రమే చర్చించారని, విలీనంపై తానొక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పార్టీ ముఖ్యులతో మాట్లాడితే బాగుంటుందనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అయితే విలీనం ఉం టుందా, ఉండదా, విలీనమైతే కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ నేతలకు మధ్య పరస్పర అవగాహన ఏమిటి, ఇరువైపులా ప్రతిపాదనలు ఏమిటనే విషయం తెలియరాలేదు.
గజ్వేల్ నుంచి పోటీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఇదే నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలో ఉంది. ఇటీవల ఫాంహౌస్‌లో సన్నిహితులతో భేటీలో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం.