శంషాబాద్, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం.. ఆపై రద్దు.. ఓ వైపు న్యాయస్థానం ఆదేశాలు.. మరో వైపు సర్కారు ఊగిసలాట ధోరణితో ఆ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఢీ నోటిఫికేషన్ చెల్లదంటూ ఇటీవల న్యాయస్థానం సర్కారును ఆదేశించడంతో.. జిల్లాలోని పదిహేను పంచాయతీలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకున్న రికార్డులను తిరిగి ఆయా పంచాయతీలకు అప్పగించినా అధికారులకు మాత్రం ఎలాంటి అధికారాలను మాత్రం కట్టబెట్టలేదు. దీంతో సుమారు నెలరోజులుగా పంచాయతీల్లో ఒక్క పని కూడా జరగడం లేదు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన పదిహేనురోజుల్లో నగరపాలక సంస్థ అధికారులు కేవలం పారిశుద్ధ్య పనులు మాత్రమే నిర్వహించారు.
పంచాయతీ ద్వారా అందజేసే గృహ నిర్మాణ అనుమతులు, రెన్యువల్, ఇంటినంబర్ల కేటాయింపు, వృత్తి, వ్యాపార లెసైన్సుల జారీ, ఆస్తిపన్ను వసూలు, హోర్డింగ్ ఫీజుల వసూలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు నీటి సరఫరా తదిత… ర పనులకు ఏమాత్రం చేపట్టలేదు. ఇంతలోనే పంచాయతీల ఢీ నొటిఫికేషన్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో జిల్లా అధికారులు వెంటనే పంచాయతీలకు సంబంధించిన రికార్డులను తిరిగి అందజేయాల్సిందిగా ఆయా డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. దీంతో రికార్డులు పంచాయతీ కార్యాలయాలకు అప్పగించారు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు
మండలంలో శంషాబాద్‌తో పాటు కొత్వాల్‌గూడ గ్రామపంచాయతీలకు సంబంధించిన రికార్డులు తిరిగి స్వాధీనం అయినప్పటికీ ఇంతవరకు సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేయడం లేదు. పజలకు సంబంధించిన మౌలికపరమైన పనులు చేపట్టడంలో కూడా అధికారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ప్రతిరోజు అనేక పనులతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు వారిని తిప్పి పంపించేస్తున్నారు. విలీనమై మళ్లి మొదటికే వచ్చిన పంచాయతీల పరిస్థితి అదే విధంగా కొనసాగుతాయా..? న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి చట్టపరిధిలో తిరిగి విలీనానికే సర్కారు మొగ్గుచూపుతుందా అన్నది ఇంకా స్పష్టం కావడం లేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి సర్కారు మరో జీవోను విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సంబంధిత శాఖల మంత్రులు ఈ విషయమై ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత రావచ్చనే సంకేతాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి నంతగిరి, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్న కతిమ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. వికారాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం విద్యార్థి, యూత్ జేఏసీల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం సీఎం పదవిని అడ్డుపెట్టుకుని డీజీపీని ప్రలోభపెట్టి ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ ద్రోహే అని మండిపడ్డారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలతో సీఎంకు తెలంగాణ రావడం ఇష్టం లేదని తేటతెల్లమైందన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ జేఏసీ చైర్మన్ శంకర్, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ రెడ్డి, కిశోర్, శ్రీకాంత్, శాంతకుమార్, విఠల్, సుజిత్ మఠంలా, శేఖర్‌రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అముల్ నాయక్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అగమ్యగోచరంలో విలీన పంచాయతీలు
Published Wed, Oct 9 2013 1:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement