సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫ్లై ఓవర్లు, ఇతర పనులకు రూ.25 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నడిచేవారి కోసం కనీసం వందల కోట్లు ఖర్చయ్యే ఫుట్‌పాత్‌లు నిర్మించలేకపోతోంది. వాహనాలకు ఎక్కడా చిక్కులు ఉండరాదని సిగ్నల్‌ఫ్రీగా సాగేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లుగానే పాదచారులు సాఫీగా నడక సాగించేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో 6 వేల కి.మీ మేర రహదారులుండగా, ప్రస్తుతం అవి 9100 కి.మీలకు పెరిగాయి. వీటిలో బీటీ, సీసీ, తదితరాలు ఉన్నాయి. రోడ్లు వాహనదారులకు సదుపాయం కాగా, నడిచేవారి కోసం రహదారి పక్కన ఫుట్‌పాత్‌లు లేవు. దీంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
కారణాలు అనేకం..
- నగరంలో కాలిబాటలు అందుబాటులో లేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాటి నిర్మాణాన్నే మరిచారు. ప్రధాన రహదారుల వెంబడి కొన్ని ప్రాంతాల్లో పేరుకు అవి కాలిబాటలైనా నడిచేవారికి ఉపయోగపడటం లేదు. వాటిపై వెలసిన దుకాణాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పబ్లిక్‌టాయ్‌లెట్లు.. వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరాలతో 50 మీటర్లు కూడా సవ్యంగా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తామని ఏళ్ల తరబడి ప్రకటనలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం పనులు మాత్రం చేయలేకపోతోంది.
- దీంతో పాదచారుల కష్టాలు తీరడం లేదు. గత రెండేళ్లలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు అవి పాదచారులకు ఉపయోగపడేలా బొలార్డ్స్, రెయిలింగ్స్ వంటివి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికీ (2014–15) నగరంలో 452 కి.మీ ఫుట్‌పాత్‌లున్నాయి. గత సంవత్సరం (2021) వరకు 817 కి.మీ.లకు పెరిగాయి. అంటే 365 కి.మీ నిర్మించారు. జోన్‌కు కనీసం 10కి.మీ ఫుట్‌పాత్‌లు నిర్మించాలని రెండేళ్లక్రితం (2020) మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 75 కి.మీ మేర పనులు చేపట్టి వాటిల్లో 60 కి.మీ మేర పూర్తిచేశారు. మిగతా 15 కి.మీ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది.
- సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం(సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్ల బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీలు 60 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు నిర్మించాయి. వీటితో కలిపి గడచిన ఏడేళ్లలో మొత్తం 365 కి.మీ.ల ఫుట్‌పాత్‌లు నిర్మించారు. రోడ్ల వెంబడి తగిన స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌ఫాత్‌లు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: క్యాబ్.. ఓన్లీ క్యాష్!)
Comments
Please login to add a commentAdd a comment