ఐదేళ్ల క్రితం విలీనమైన శివారు ప్రాంతాల ప్రజలు ఒకవైపు సమస్యలతో సతవుతవువుతుండగా, ఇటీవలి కాలంలో మరో 35 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడాన్ని అన్ని పార్టీలు తప్పుబట్టాయి.
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం విలీనమైన శివారు ప్రాంతాల ప్రజలు ఒకవైపు సమస్యలతో సతవుతవువుతుండగా, ఇటీవలి కాలంలో మరో 35 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడాన్ని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. జీహెచ్‌ఎంసీ సర్వసభ్య మండలి సమావేశంలో రాజకీయాల కతీతంగా పార్టీలన్నీ విలీనాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాయి. విలీనాన్ని ఒప్పుకోబోవుని, ఇందుకు సంబంధించిన జీవోలను ఉపసంహరించుకోవాలని పార్టీలు డిమాండ్ చేశాయి. నిధుల కొరతవల్ల, ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లోపించినందునే పంచాయుతీల విలీనాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించినట్టు జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రకటించారు. నగరంలో తాగునీటి అవసరాలను తీర్చడం తమచేత కాదని ఇప్పటికే జలమండలి స్పష్టం చేస్తున్నా, ప్రభుత్వం ఏ అంచనాతో హడావుడిగా పంచాయుతీల విలీనం చేపట్టిందని, అసలు విలీనంచేసిన గ్రామాలపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటని వివిధ పార్టీల సభ్యులు నిలదీశారు. ఆయా గ్రామాల ప్రజల వ్యతిరేకిస్తున్నా,..15 గ్రావూల విలీనం ప్రతిపాదనను గత సర్వసభ్య సవూవేశం ఏకగ్రీవంగా తిరస్కరించినా సదరు తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చే సిందన్నారు.
విలీనంతో ఆయా గ్రామాల ప్రజలపై పన్నుల భార ం తప్ప, వారికెలాంటి సేవలు అందబోవన్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో కలిసిన 12 మునిసిపాలిటీల పరిస్థితిని కూడా వారు ప్రస్తావించారు. విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత మొత్తంతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారో చెప్పాలంటూ పార్టీలు డిమాండ్ చేశాయి. అప్పటి వరకు జీహెచ్‌ఎంసీ నిధులతో ఎలాంటి పనులు చేపట్టరాదని తీర్మానించారు. రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ నివ్వాలని, కార్యాచరణ అమలుపై శ్వేతపత్రం వెలువరించాలని, అప్పటి వరకు యుథాతథ స్థితిని కొనసాగించాలని కోరాయి. ఈ అంశంలో సీఎంను కలసి తమ వాణి వినిపించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంచాయుతీల విలీనాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించారుు. బీజేపీ సభ్యులు సభలో లేకపోయినప్పటికీ, విలీన వ్యతిరేక తీర్మానానికి ఆమోదం తెలిపారు. రోడ్ల దుస్థితికి, గ్రామాల విలీనచర్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో, వారిని అంతకువుుందు మార్షల్స్ సాయుంతో బయటకు పంపించారు.