village panchayathi
-
‘ఉపాధి’ పనుల్లో 33 లక్షల అవినీతి
పీసీపల్లి, న్యూస్‌లైన్ : పీసీపల్లి మండలంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో 33 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బందికి ఈ అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని విమర్శలొస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఉపాధి నిధులు ఈ ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఉపాధి హామీ నిధులను నొక్కేసేందుకు వేదికగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలతో పీసీపల్లి మండలంలోని మేజర్‌పంచాయతీల్లో హడావుడిగా పనులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చోటా నాయకులు.. తమ పలుకుబడిని ఉపయోగించి బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. పీసీపల్లి మండలంలో 2012-13లో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు 1.87 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్‌కు 14.47 లక్షలు, కూలీలకు 1.72 కోట్లు చెల్లించారని, మొత్తం 1,200 పనులు చేపట్టినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో వెల్లడించారు. ఈ పనుల్లో మొత్తం 33 లక్షల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఉపాధి హామీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడింది ఈ గ్రామాల్లోనే.. గుదేవారిపాలెంలో 4 లక్షల పనులు చేయగా 1.85 లక్ష లు, బట్టుపల్లిలో 2 లక్షల పనులు చేయగా 5 వేలు, వేపగుంపల్లిలో 38 వేల పనులు చేయగా 2 వేలు, వెంగళాయపల్లిలో 14.80 లక్షలకు గాను 4.50 లక్షలు, పీసీపల్లిలో 30 లక్షల పనులకుగాను 1.80 లక్షలు, గుంటుపల్లిలో 15 లక్షల పనులకుగాను 5.80, మారెళ్లలో 4 లక్షల పనులకుగాను 16 వేలు, మురుగమ్మిలో 25 లక్షల పనులకుగాను 13 లక్షలు, లక్ష్మక్కపల్లిలో 12 లక్షల పనులకుగాను 2 లక్షలు, తలకొండపాడులో 3 లక్షల పనులకుగాను 15 వేలు, పెదఇర్లపాడులో 8 లక్షల పనులకుగాను 70 వేలు, పెదఅలవలపాడులో 11 లక్షల పనులకుగాను 97 వేలు, చౌటగోగులపల్లిలో 3 లక్షల పనులకుగాను 10 వేలు, చింతగుంపల్లిలో 14 లక్షల పనులకుగాను 10 వేలు, చినవరిమడుగులో 6 లక్షల పనులకుగాను 3.50 లక్షలు, ముద్దపాడులో వేయి, నేరేడుపల్లిలో 9 లక్షల పనులకుగాను 2 వేలు నొక్కేసినట్లు తనిఖీలో తేలిందని స్టేట్ ఎస్ఆర్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
అటకెక్కిన ‘ఆన్లైన్’ సేవలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ సేవలు ఇప్పట్లో జిల్లాలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం వంటి వివరాలు ప్రతీఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నింటినీ కంప్యూటరీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసిన అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆన్లైన్ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. జిల్లాలో 839 మైనర్, 27 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల అడిటింగ్ సాఫ్ట్వేర్ (ప్రియా సాఫ్ట్) ద్వారా ఆన్లైన్లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కానరావడం లేదు. నిధులు పక్కాదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. 2011 ఆగస్టులో పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 13వ అర్థిక సంఘం నిధులు అగిపోయాయి. ఆ నిధులు గత నెలలో 2011-12కు సంబంధించిన 13వ అర్థిక సంఘం(టీఏఫ్సీ) రూ.11.78 కోట్లు విడుదల అయ్యాయి. ఇక నుంచి నిధులు విడుదల కావాలంటే పంచాయతీల పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలు ఆన్లైన్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా వీటిని ఆన్లైన్లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు కుస్తీ పడుతున్నారు. పంచాయతీల్లో కంప్యూటర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే పంచాయతీ గ్రామాల్లో నీటి సరఫరా నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కారణాలు అనేకం.. జిల్లాలో 866 పంచాయతీలుండగా కేవలం 190 వరకే కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కార్యదర్శికి నాలుగు నుంచి ఐదారు పంచాయతీల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల, వినియోగం తదితర వాటిని ఆన్లైన్లో పెట్టెందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి సరైన అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో కంప్యూటర్లు లేక పోవడంతో వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర, సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహన రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో పొందుపరచకుండా మమ అంటున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ కాకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పూర్తి స్థాయి వివరాలు ఆన్లైన్లో లభించడం లేదు. గడువు ముగిసి ఆరునెలలు గడుస్తున్నా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీల వివరాలు ఆన్లైన్ చేయని వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం లేదు. అదే జరిగితే పంచాయతీల అభివృద్ధికి తీవ్ర అటంకం ఏర్పాడుతుంది. 650 నుంచి 670 వరకు ఆన్లైన్ చేశాం.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 650 నుంచి 670 వరకు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వివరాలను ఆన్లైన్లో పొందుపరిచాము. మిగతా పంచాయతీల వివరాలు ఆన్లైన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. -
విలీనం వద్దు.. జీహెచ్ఎంసీ సర్వసభ్య మండలి ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం విలీనమైన శివారు ప్రాంతాల ప్రజలు ఒకవైపు సమస్యలతో సతవుతవువుతుండగా, ఇటీవలి కాలంలో మరో 35 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. జీహెచ్ఎంసీ సర్వసభ్య మండలి సమావేశంలో రాజకీయాల కతీతంగా పార్టీలన్నీ విలీనాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాయి. విలీనాన్ని ఒప్పుకోబోవుని, ఇందుకు సంబంధించిన జీవోలను ఉపసంహరించుకోవాలని పార్టీలు డిమాండ్ చేశాయి. నిధుల కొరతవల్ల, ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లోపించినందునే పంచాయుతీల విలీనాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించినట్టు జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రకటించారు. నగరంలో తాగునీటి అవసరాలను తీర్చడం తమచేత కాదని ఇప్పటికే జలమండలి స్పష్టం చేస్తున్నా, ప్రభుత్వం ఏ అంచనాతో హడావుడిగా పంచాయుతీల విలీనం చేపట్టిందని, అసలు విలీనంచేసిన గ్రామాలపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటని వివిధ పార్టీల సభ్యులు నిలదీశారు. ఆయా గ్రామాల ప్రజల వ్యతిరేకిస్తున్నా,..15 గ్రావూల విలీనం ప్రతిపాదనను గత సర్వసభ్య సవూవేశం ఏకగ్రీవంగా తిరస్కరించినా సదరు తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చే సిందన్నారు. విలీనంతో ఆయా గ్రామాల ప్రజలపై పన్నుల భార ం తప్ప, వారికెలాంటి సేవలు అందబోవన్నారు. ఇప్పటికే గ్రేటర్లో కలిసిన 12 మునిసిపాలిటీల పరిస్థితిని కూడా వారు ప్రస్తావించారు. విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత మొత్తంతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారో చెప్పాలంటూ పార్టీలు డిమాండ్ చేశాయి. అప్పటి వరకు జీహెచ్ఎంసీ నిధులతో ఎలాంటి పనులు చేపట్టరాదని తీర్మానించారు. రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ నివ్వాలని, కార్యాచరణ అమలుపై శ్వేతపత్రం వెలువరించాలని, అప్పటి వరకు యుథాతథ స్థితిని కొనసాగించాలని కోరాయి. ఈ అంశంలో సీఎంను కలసి తమ వాణి వినిపించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంచాయుతీల విలీనాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్సీపీ వ్యతిరేకించారుు. బీజేపీ సభ్యులు సభలో లేకపోయినప్పటికీ, విలీన వ్యతిరేక తీర్మానానికి ఆమోదం తెలిపారు. రోడ్ల దుస్థితికి, గ్రామాల విలీనచర్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో, వారిని అంతకువుుందు మార్షల్స్ సాయుంతో బయటకు పంపించారు. -
విలీనం వెనుక రహస్య ఎజెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీహెచ్ఎం సీలో గ్రామ పంచాయతీల విలీనం వెనుక రహస్య ఎజెండా దాగిఉందని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆగమేఘాల మీద రాత్రికిరాత్రే శివారు పంచాయతీలను గ్రేటర్ లో కలపడానికి బలమైన కారణాలున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర విభజన తరుణంలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేలా ఆదృశ్యశక్తులు పావులు కదిపాయన్నారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన టీడీపీ అత్యవసర సమావేశం జరిగింది.దేవేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆదాయాన్ని ఉమ్మడిగా పంచుకునే కుట్రలో భాగంగానే నగర పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆదాయ వనరులు దండిగా ఉన్న పంచాయతీలను కలపడం ద్వారా ఆస్తులను పరిరక్షించుకోవడమే కాకుండా... రెవెన్యూలోను అధికవాటాను కొల్లగొట్టొచ్చని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు ఆరోపించారు. జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల విలీనాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్లో అంతర్భాగమైన శివారు మున్సిపాలిటీల్లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప.. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని అన్నారు. గ్రేటర్‌తో గ్రామీణ ప్రజలకు పన్ను ల భారం తప్ప ఒరిగేదేమీలేదని పేర్కొన్నా రు. విలీనం సరికాదని, అవసరమైతే మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చాలని కోరినప్పటికీ సీఎం ఏకపక్షంగా విలీన ఉత్తర్వులు జారీ చేయడం దురదృష్టకర మన్నారు. జిల్లా ఉనికిని కాపాడుకునేందు కు రాజకీయాలకతీతంగా జిల్లా నేతలు కలిసిరావాలని దేవేందర్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామని, 19న ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సహా పలువురు నేతలు నిరవధిక దీక్ష చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్ ఎండీఏ, ఏపీఐఐసీలు అడ్డగోలు వ్యవహారాలతో జిల్లా ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. సంపన్న వర్గాలకు కొమ్ముకాసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నా జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రి య చేపట్టిన అధికార పార్టీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే రత్నం పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ , ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డితో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
సర్పంచ్ల పవర్‌కు చెక్!
ఘట్‌కేసర్‌టౌన్/కుల్కచర్ల/యాచారం,న్యూస్‌లైన్: గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వారికి ఇంకా ‘పవర్’ దక్కలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్‌లందరూ ఈ నెల 2వతేదీన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఉవ్విళ్లూరుతున్న కొత్త సర్పంచ్ల ఉత్సాహంపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ప్రత్యేకాధికారులు, కార్యదర్శుల నుంచి ఇప్పటికీ వీరికి పంచాయతీ రికార్డులు అందకపోవడంతో నిస్సహాయ స్థితిలో పడ్డారు. గతంలో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల్లో ఒక్కరికి చెక్‌పవర్ అధికారాన్ని కల్పించేవారు. కాగా ఈ సారి ఎవరికి, ఏ విధంగా చెక్‌పవర్ ఇవ్వాలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కార్యదర్శులు నూతన సర్పంచ్‌లకు రికార్డులు అప్పగించలేదు. దీంతో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు వీధి దీపాల ఏర్పాటుకు, మురుగు కాల్వల శుభ్రానికి అలాగే తాగునీటి సరఫరాకు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. ఉత్సవ విగ్రహాల్లా... బాధ్యతలు చేపట్టిన రోజునే పంచాయతీ రికార్డులు అందజేయాల్సి ఉండగా వారంరోజులు దాటినా అవి అందకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. అసలు పంచాయతీలో జనరల్ ఫండ్ ఎంతుంది.. ప్రభుత్వమిచ్చిన నిధులెన్ని.. వసూలైన పన్నులు... వేటికి ఎంత ఖర్చు చేశారు, ఎవరికెంత చెల్లించాలి? వంటివి తెలియక సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. ప్రత్యేకాధికాధికారుల పాలనలో గ్రామాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయనున్నట్టు కుల్కచర్ల మండలంలోని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు నిలిచిపోయిన వేతనాలు ప్రతి నెల మొదటి వారంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఆగిపోయాయి. పంచాయతీల్లో పన్నుల రూపంలో వసూలైన డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. ప్రతి చెల్లింపు చెక్కుల రూపేణా జరగాలి. అయితే సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో నిధులను డ్రా చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి. లెక్కల్లేవ్... ఇదిలా ఉంటే ప్రత్యేకాధికారుల పాలనలో చాలా పంచాయతీలో నిధులు, ఖర్చుల లెక్కలు సక్రమంగా లేనట్టు తెలుస్తోంది. యాచారం మండలంలో అంతోఇంతో ఆదాయం ఉండే యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో రికార్డుల నమోదు గందరగోళంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యాచారం గ్రా మంలో రికార్డులు ఇవ్వకుండా సర్పంచ్‌కు బోరుబావుల మోటార్లు, పైపులు చూపించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రత్యేకాధికారుల్లో ఆందోళన... నూతన సర్పంచ్‌లు రికార్డులు అందజేయాలని పట్టుపడుతుండటంతో ప్రత్యేకాధికారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో వెంచర్లకు అనుమతులు ఇవ్వడం, అవి కూడ పాత సర్పంచ్ల సంతకాలతో రికార్డులు నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రికార్డులు ఇవ్వకుండా... వాటిని ప్రత్యేకాధికారులు కార్యదర్శులతో తమ వద్దకు తెప్పించుకొని సరిచేయిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. బోరు మోటార్లు మాత్రమే చూపించారు పంచాయతీలో పైసలు ఎన్ని ఉన్నాయని అడిగితే లెక్క చెప్పకుండా వీటికి ఖర్చయినాయని బిగించిన బోరుమోటార్లు, వేసిన పైపులు చూపించారు. ఎన్ని వెంచర్లకు అనుమతులు ఉన్నాయి, చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల రికార్డులు త్వరలోనే ఇస్తామని అన్నారు. - మారోజ్ కళమ్మ, యాచారం సర్పంచ్ ప్రభుత్వం స్పందించాలి రికార్డులు ఇవ్వకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియం లేదు. ఖర్చయిందెం త, ఎన్ని నిధులు ఉ న్నాయో కూడా చెప్ప డం లేదు. చెక్‌పవర్ ఎవరెవరికిస్తారోనన్నది కూడా అధికారుల దగ్గరే సమాచారం లేదు. ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. - గాంధారి లక్ష్మీనారాయణ, పోచారం సర్పంచ్, ఘట్కేసర్