పీసీపల్లి, న్యూస్‌లైన్ :
పీసీపల్లి మండలంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో 33 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బందికి ఈ అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని విమర్శలొస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు ఉపాధి నిధులు
ఈ ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఉపాధి హామీ నిధులను నొక్కేసేందుకు వేదికగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలతో పీసీపల్లి మండలంలోని మేజర్‌పంచాయతీల్లో హడావుడిగా పనులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చోటా నాయకులు.. తమ పలుకుబడిని ఉపయోగించి బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. పీసీపల్లి మండలంలో 2012-13లో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు 1.87 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్‌కు 14.47 లక్షలు, కూలీలకు 1.72 కోట్లు చెల్లించారని, మొత్తం 1,200 పనులు చేపట్టినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో వెల్లడించారు. ఈ పనుల్లో మొత్తం 33 లక్షల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఉపాధి హామీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు.
అవినీతికి పాల్పడింది
ఈ గ్రామాల్లోనే..
గుదేవారిపాలెంలో 4 లక్షల పనులు చేయగా 1.85 లక్ష లు, బట్టుపల్లిలో 2 లక్షల పనులు చేయగా 5 వేలు, వేపగుంపల్లిలో 38 వేల పనులు చేయగా 2 వేలు, వెంగళాయపల్లిలో 14.80 లక్షలకు గాను 4.50 లక్షలు, పీసీపల్లిలో 30 లక్షల పనులకుగాను 1.80 లక్షలు, గుంటుపల్లిలో 15 లక్షల పనులకుగాను 5.80, మారెళ్లలో 4 లక్షల పనులకుగాను 16 వేలు, మురుగమ్మిలో 25 లక్షల పనులకుగాను 13 లక్షలు, లక్ష్మక్కపల్లిలో 12 లక్షల పనులకుగాను 2 లక్షలు, తలకొండపాడులో 3 లక్షల పనులకుగాను 15 వేలు, పెదఇర్లపాడులో 8 లక్షల పనులకుగాను 70 వేలు, పెదఅలవలపాడులో 11 లక్షల పనులకుగాను 97 వేలు, చౌటగోగులపల్లిలో 3 లక్షల పనులకుగాను 10 వేలు, చింతగుంపల్లిలో 14 లక్షల పనులకుగాను 10 వేలు, చినవరిమడుగులో 6 లక్షల పనులకుగాను 3.50 లక్షలు, ముద్దపాడులో వేయి, నేరేడుపల్లిలో 9 లక్షల పనులకుగాను 2 వేలు నొక్కేసినట్లు తనిఖీలో తేలిందని స్టేట్ ఎస్‌ఆర్‌పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
‘ఉపాధి’ పనుల్లో 33 లక్షల అవినీతి
Published Thu, Dec 26 2013 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement