కార్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌కార్ తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలీనం అనంతరం జూమ్‌కార్ హోల్డింగ్స్‌గా పేరు మారనుంది. ఈ లావాదేవీ ద్వారా జూమ్‌కార్ హోల్డింగ్స్ విలువ రూ.3,753 కోట్లుగా లెక్కించారు. విలీనం అనంతరం ఏర్పడిన కంపెనీని నాస్‌డాక్‌లో లిస్ట్ చేస్తారు. 2013లో ప్రారంభం అయిన జూమ్‌కార్ హోల్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. కార్ షేరింగ్ మార్కెట్‌ప్లేస్‌లో 25,000 కంటే ఎక్కువగా వాహనాలు నమోదయ్యాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఆఫ్రికాలోని దక్షిణ సహారా దేశాల్లో అపార అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు జూమ్‌కార్ కో–ఫౌండర్, సీఈవో గ్రెగ్ మోరన్ తెలిపారు. 2025 నాటికి రూ.7.4 లక్షల కోట్ల మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment