బూర్గంపాడు, న్యూస్‌లైన్:
బూర్గంపాడును సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ గురువారం స్థానికంగా నిరసనలు మిన్నం టాయి. వందలాది మంది రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. బూర్గంపాడు ప్రధాన కూడలిలో రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేసి, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు, యువకులు మానవహారం నిర్వహించా రు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో పోలీసులకు, స్థానిక నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వందలాది మంది తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా తెలంగాణలో మమేకమైన బూర్గంపాడును సీమాం ధ్రలో కలపటం నీతిమాలిన చర్యేనని విమర్శిం చారు. ఓ ప్రాంతప్రయోజనాల కోసం తెలంగాణలో అంతర్భాగమైన బూర్గంపాడు మండలాన్ని బలిచేయటం తగదన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మండల ప్రజలను ముంచ టం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎలా అయితే ఉద్యమించారో.. జిల్లాలోని అన్ని ప్రాంతాలు తెలంగాణలో ఉండేలా కూడా పోరాడాలని తెలంగాణవాదులను కోరారు. ఈ విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు అఖిల పక్ష నాయకులు పుట్టి కుమారి, జక్కం బలరామ్, భూపెల్లి నర్సింహారావు, పొదిలి రాములు, మారం శ్రీనివాసరెడ్డి, కాకర్ల ప్రతాప్, దుగ్గిరాల శ్రీరామ్‌రెడ్డి, దుద్దుకూరి రాజా, భజన సతీష్, మేకల నర్సింహా రావు, భజన ప్రసాద్, చిప్పా సుధాకర్ పేరాల శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు.
బంద్ సంపూర్ణం...
బూర్గంపాడును సీమాంధ్రలో కలిపే సవరణకు లోక్‌సభ ఆమోదాన్ని నిరసిస్తు అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన బూర్గంపాడు బంద్ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆటో యూనియన్ వారు స్థానికంగా ఆటోలను కూడా నడపలేదు.
మిన్నంటిన నిరసనలు
Published Fri, Feb 21 2014 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement