![Players back Federers proposal to merge mens and womens tennis - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/24/BILLIE-JEAN-KING.jpg.webp?itok=VZNsp7Ri)
బిల్లీ జీన్ కింగ్
పారిస్: మహిళల, పురుషుల టెన్నిస్ పాలక మండళ్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఇటీవల ట్విట్టర్‌లో రెండు టెన్నిస్ పాలక వర్గాలను విలీనం చేయాలని సూచించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విలీనానికి అతని సమకాలీన దిగ్గజం రాఫెల్ నాదల్ మద్దతు తెలపగా.... ఇప్పుడు ఈ జాబితాలో డబ్ల్యూటీఏ వ్యవస్థాపకులు బిల్లీ జీన్ కింగ్ చేరారు. విలీనానికి ఇదే సరైన సమయమని ఆమె అన్నారు. ఆమె 1973లో డబ్ల్యూటీఏను స్థాపించారు. అప్పట్లోనే తాను రెండు వర్గాలను ఏకం చేయాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడైనా సాకారం కావాలని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment