
విలీనంపై నేనొక్కడే నిర్ణయం తీసుకోలేను: కేసీఆర్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేసే విషయంలో తానొక్కడే నిర్ణయం తీసుకోలేనని ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేసే విషయంలో తానొక్కడే నిర్ణయం తీసుకోలేనని ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు అన్నారు. మార్చి 3 న జరిగే పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తనపై విమర్శలు చేయడం విడ్డూరమని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరముందని, తెలంగాణకు సమర్థవంతమైన నాయకత్వం కావాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులు విభిన్నంగా కనిపిస్తున్నాయి. విలీనానికి టీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. విలీనం కంటే పొత్తే మేలని చెబుతుండగా, తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ కేసీఆర్పై విమర్శలు చేయడం, ఇందుకు ప్రతిగా టీఆర్ఎస్ చీఫ్ స్పందిచడం తదితర పరిణామాల నేపథ్యంలో విలీపం సాధ్యమేనా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.