ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం! | Uber to Merge China Operations With Rival Didi Chuxing: Report | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!

Published Mon, Aug 1 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!

ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!

చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్, దిది చుక్సింగ్లకు మధ్య నెలకొన్న ప్రచండ యుద్ధానికి తెరపడనుంది.

చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్, దిది చుక్సింగ్లకు మధ్య నెలకొన్న ప్రచండ యుద్ధానికి తెరపడనుంది. ఉబర్ ఓ మెట్టు దిగొచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనా ఆపరేషన్స్ను ఉబర్, తన ప్రత్యర్థి కంపెనీ దిది చుక్సింగ్లో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విలీన డీల్తో 35 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2,33,551 కోట్లు)విలువగా  సంయుక్త కంపెనీ ఆవిర్భవించబోతుందని బ్లూమ్బర్గ్ రిపోర్టు నివేదించింది. ఈ సంయుక్త కంపెనీలో ఉబర్ చైనా ఇన్వెస్టర్లు 20 శాతం స్టాక్ ను పొందనున్నట్టు తెలిపింది. ఈ కొత్త డీల్తో ఉబర్లో దిది చుక్సింగ్ ఒక బిలియన్ డాలర్లను( సుమారు రూ.6,673 కోట్లను) పెట్టుబడులుగా పెట్టనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది..


చైనాలో ఉబర్కు ఎదురవుతున్న భారీ నష్టాలను తొలగించుకోవడానికి ఆ సంస్థ ఈ మేరకు పావులు కదుపుతుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. భవిష్యత్తులో తమ మనుగడును కొనసాగించడానికి ఈ డీల్ సాయపడనుందని ఉబర్ భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన నేడు(సోమవారం) వెలువడే అవకాశముందుని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ రిపోర్టులపై ఉబర్, దిది చుక్సింగ్ కంపెనీల అధికార ప్రతినిధులు వెంటనే స్పందించడానికి నిరాకరించారు. చైనా మార్కెట్ షేరును దక్కించుకోవడానికి, ఆధిపత్య స్థానంలో కొనసాగడానికి ఈ రెండు సంస్థలు బిలియన్ డాలర్లను డ్రైవర్లకు, ప్యాసెంజర్ల సబ్సిడీల కోసం వెచ్చిస్తూ ఉన్నాయి.

చైనా రైడ్ షేరింగ్ మార్కెట్ లో 90శాతం స్థానాన్ని దిది సొంత చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గత నెలే ఈ కంపెనీలో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లను పెట్టుబడులుగా కూడా పెట్టింది.  50 దేశాలకు పైగా విస్తరించిన ఉబర్, అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ కంపెనీ చాలా ప్రాంతాల్లో రెగ్యులేటరీ నిబంధనను, టాక్సీ ఆపరేటర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఈ రిపోర్టులు వెలువడిన వెంటనే రైడ్ షేరింగ్పై కొత్త నిబంధనలు విధిస్తూ చైనీస్ అథారిటీలు  ప్రకటన విడుదల చేశారు. తక్కువ ధరలకు రైడ్ షేరింగ్ ఆపరేట్ చేయడంపై నిషేధం, సబ్సిడీలు ఆఫర్లపై పరిమితులను ఈ నిబంధనలు విధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement