మిర్యాలగూడెం నియోజకవర్గాన్ని నల్లగొండలో కలిపేందకు ససేమిరా ఒప్పుకోమంటూ ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రి జి.జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు
నల్లగొండ: మిర్యాలగూడెం నియోజకవర్గాన్ని నల్లగొండలో కలిపేందకు ససేమిరా ఒప్పుకోమంటూ ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రి జి.జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నల్లగొండలోని మంత్రి నివాసంలో కలిసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సూర్యాపేట జిల్లాలో కలపాలంటూ అభ్యర్థించారు. వేముపల్లి, దామచర్ల, మిర్యాలగూడెం రూరల్ మండలానికి చెందిన జెడ్పీటీసీలు, వైస్‌ఎంపీపీలు, సర్పంచ్‌లు వివిధ గ్రామాల ప్రజలు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.