
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్‌కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్‌కు సోషల్ మీడియా ద్వారా యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది.
Comments
Please login to add a commentAdd a comment