హైదరాబాద్, సాక్షి: తెలంగాణకు నిధుల కోసం పోరాడటంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపిందని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారు. తెలంగాణకు నిధుల సాధనలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయి. నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు?. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో తన హక్కును, సమానత్వాన్ని కోరుతోంది.
అందుకు తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు సున్నా. అదే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,000 కోట్ల అదనపు గ్రాంట్లు కేటాయించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వాలి’ అని అన్నారు.
Centre gives 100 crore to Andhra Pradesh for Godavari Pushkaralu, but Telangana gets a big ZERO! 8 BJP MPs, 2 Union Ministers from Telangana, yet not a single rupee for our state. BJP and Congress have miserably failed to fight for Telangana’s due share. If BRS were in a strong…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 11, 2024
చదవండి: నిధుల సాధనలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు
Comments
Please login to add a commentAdd a comment