బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ | congress leaders protest at bjp office over remarks on rahul gandhi hyderabad | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

Sep 18 2024 1:24 PM | Updated on Sep 18 2024 1:40 PM

congress leaders protest at bjp office over remarks on rahul gandhi hyderabad

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. మహిళా కాంగ్రెస్‌ నేతలు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. భారీగా కాంగ్రెస్‌నేతలు చేరుకోని బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

దీంతో మహిళా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీసు ఎదుట మహిళా కాంగ్రెస్‌ నేతలు బైఠాయించి  బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రాహుల్‌ గాంధీకి బీజేపీ నేతలు క్షమాపలు చేప్పాలని డిమాండ్‌ చేశారు.

గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత..
రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement