‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇండస్ట్రీ కూడా ప్రాంతాల విభేదం లేకుండా ప్రతిఒక్కరినీ ఆదరించాలి. సినిమా ఇండస్ట్రీ అనేది లక్షలాదివాళ్లకి ఉపాధి కల్పిస్తు్తంది. చిన్న సినిమాలకు ప్రమోషన్ ఎంతో అవసరం. అందరం చిన్న చిత్రాలను ఆదరించాలి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీకాంత్, మేఘాచౌదరి, అభయ్ ముఖ్య పాత్రల్లో జైరాజాసింఘ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభయ్ అదాక నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత కొత్త కథలు వస్తాయి.
అభయ్‌కి, జైరాజాసింఘ్‌కి ఈ సినిమా మొదటి చిత్రంలా లేదు. ఎంతో అనుభవం ఉన్నవారిలా తీశారు. ‘జెర్సీ’ సినిమా కూడా చాలా బావుంది. ‘మార్షల్’ చిత్రం మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. అభయ్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుడిగా, నిర్మాతగా నా ప్రయత్నం వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న తలసానిగారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. జయ్‌రాజ్ తన సొంత సినిమాలాగా చేశారు’’ అన్నారు. ‘‘మెడికల్ యాక్షన్ మూవీ ఇది.
ఒక మనిషి ఇంత ఈజీగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఒక సైంటిస్ట్. అందులోంచి వచ్చిన కథే ‘మార్షల్’ అన్నారు జైరాజాసింఘ్. ‘‘నేను కథ విన్నాక రెండురోజులు టైం అడిగి ఓకే చెప్పాను. పైగా కొత్త దర్శకుడుకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఈ సినిమా చూశాక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు’’ అని శ్రీకాంత్ అన్నారు. మేఘాచౌదరి మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, నేపథ్య సంగీతం: కె.జి.ఎఫ్.రవిబాసుర్, కెమెరా: స్వామీ ఆర్.ఎం.
Comments
Please login to add a commentAdd a comment