ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కి 40 ఏళ్లు వచ్చాయి. ఆయన తన 40వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోలేదు. దీనికి పలు కారణలున్నాయని తెలుస్తోంది. ఇందులో ముఖ్య కారణం మాత్రం కిమ్ జాంగ్ ఉన్ తల్లేనట. ఎందుకంటే కిమ్ తల్లి జపాన్‌కు చెందిన మహిళ అవడంతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటే ఆమె ఉత్తర కొరియాకు చెందినది కాదనే చర్చ జరుగుతుందని కిమ్ భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇది ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన తండ్రి, తాత తరహాలో బర్త్‌డే రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వడంతో పాటు మిలిటరీ పరేడ్ నిర్వహించేత వయసు తనకు ఇంకా రాలేదని, తాను ఇంకా చిన్నవాడినని ఆయన అనుకుంటుంటారని సమాచారం. ఈ కారణాలతోనే కిమ్ తన బర్త్‌డే వేడుకలను జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే బర్త్‌డే రోజు కిమ్ తన కూతురుతో కలిసి ఓ కోళ్ల ఫామ్‌ను సందర్శించినట్లు వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment