యస్.కె.ఎన్
‘‘అభిమానిగా మొదలైన నా ప్రయాణం జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా ప్రస్తుతం నిర్మాత వరకూ వచ్చింది. ఈ ప్రయాణంలో నన్ను నిలబెట్టినవాళ్లు, నాతో నిలబడ్డవాళ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు యస్.కె.ఎన్. ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ‘ఈ రోజుల్లో, టాక్సీ వాలా’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు యస్.కె.యన్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గురించి యస్.కె.యన్. మాట్లాడుతూ– ‘‘ఇంటర్‌నెట్ ఇంకా ఊపు అందుకోని సమయంలో ఏలూరులో ఎర్లీ మార్నింగ్ షో చూసి సినిమా మీద నా అభిప్రాయాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసేవాణ్ణి.
ఆన్‌లైన్‌లో మెగాఫ్యాన్స్ క్లబ్ రన్ చేసేవాళ్లం. అల్లు శిరీష్‌గారితో పరిచయం అయింది. ఆయన నన్ను బన్నీ (అల్లు అర్జున్)గారికి పరిచయం చేశారు. బన్నీగారు హీరో అయ్యే సమయం నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ వచ్చాను. ఏం చేస్తావు? అని అడిగారు బన్నీ. మీ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతాను అని చెప్పాను. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడింది. టీవీ9లో కొంత కాలం పని చేశాను. ఆ తర్వాత పీఆర్వోగా సినిమాలు చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, దర్శకుడు మారుతీ, నేను కలసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాం.
మారుతితో ఏర్పడ్డ అసోసియేషన్ వల్ల తన ప్రతీ సినిమాలో భాగమవుతూ వస్తున్నాను. జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు సినిమాను విశ్లేషిస్తూ, ఎలా ఉండాలో అని విమర్శించాం. ఇప్పుడు ఆ విమర్శలు రాకుండా స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. దేశంలో బెస్ట్ కమర్షియల్ సినిమాలు మనమే తీయగలం అని నా అభిప్రాయం. మమ్మల్ని గైడ్ చేస్తున్న అరవింద్‌గారికి, చిరంజీవిగారికి థాంక్స్. మొదటి సినిమాకే విజయ్ దేవరకొండ లాంటి అప్‌కమింగ్ స్టార్ హీరోతో సినిమా నిర్మించడం మంచి ఎక్స్‌పీరియన్స్. ప్రస్తుతం ఇద్దరు డైరెక్టర్స్ కథల్ని ఓకే చేశాం. సాయి తేజ్‌తో మారుతి తీస్తున్న ‘ప్రతి రోజూ పండగ’ భిన్నంగా ఉంటుంది. ప్రతీ ప్రాజెక్ట్ నాకు డ్రీమ్ ప్రాజెక్టే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment