పట్నా: ‘అన్నిటి కంటే పెద్ద ఆస్తులు– కూతురు, నీరు, అడవి’(సబ్‌సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్)..ఇది బీజేపీ కొత్త నినాదం. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశ మంతటా బీజేపీ దీనిని వారం పాటు అమలు చేయనుంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం బీజేపీ జాతీయ కన్వీనర్ రాజేంద్ర ఫడ్కే పట్నాలో మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దీనిని అమలు చేయనున్నామన్నారు. ప్రధాని జన్మదినం ఈ నెల 17వ తేదీ కాగా, ఈ కార్యక్రమం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహంగా చేపడతామన్నారు. ‘ఇందులో భాగంగా ఆడపిల్ల పుట్టిన ప్రాంతంలో, ముఖ్యంగా నిరుపేదలుండే చోట బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచి, ఒక మొక్కను నాటుతారు. నీటి సంరక్షణ ప్రాధాన్యం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించరాదని అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచార కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లాలు, అన్ని బ్లాకుల్లోనూ జరుగుతుంది’ అని వివరించారు. గత ఐదేళ్లలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమం వల్ల బిహార్ వంటి రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment