
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం 69వ ఏట అడుగుపెట్టారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని తొలుత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు. 98 సంవత్సరాల హీరాబెన్ తన చిన్న కుమారుడు పంకజ్ మోదీతో కలిసి రైసిన్ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం గాంధీనగర్ నుంచి ఆయన నర్మదా జిల్లాలోని కెవదియా చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నర్మదా నదీ తీరంలో మా నర్మద పూజ నిర్వహించడంతో పాటు సర్ధార్ సరోవర్ డ్యామ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శిస్తారు. గరుడేశ్వర్‌లో దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించిన అనంతరం కెవదియాలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment