Manchu Manoj To Distribute HouseHold essentials To 25,000 Families On His Birthday - Sakshi
Sakshi News home page

పాజిటివ్‌గా ఉండండి.. పాజిటివ్‌ తెచ్చుకోకండి

May 21 2021 12:15 AM | Updated on May 21 2021 9:21 AM

Manchu Manoj decides to distribute essentials on his birthday - Sakshi

కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్‌ తెలిపారు. మే 20న (గురువారం) హీరో మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. ఆ విషయం గురించి మనోజ్‌ మాట్లాడుతూ – ‘‘కోవిడ్‌ బాధితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలు పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు కోవిడ్‌ కట్టడిలో భాగస్వాములైనవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజూ శానిటైజ్‌ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడుతుంది. ఈ లాక్‌డౌన్‌లో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. అందరూ కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండంyì... కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement