Distribution of essential goods
-
పాజిటివ్‌గా ఉండండి.. పాజిటివ్ తెచ్చుకోకండి
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మే 20న (గురువారం) హీరో మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. ఆ విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ బాధితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలు పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు కోవిడ్ కట్టడిలో భాగస్వాములైనవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజూ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతుంది. ఈ లాక్డౌన్లో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండంyì... కానీ కోవిడ్ పాజిటివ్ తెచ్చుకోకండి’’ అన్నారు. -
‘వరద బాధితులందరికీ నిత్యవసర వస్తువుల పంపిణీ’
సాక్షి, విజయవాడ: కృష్ణానది వరద ముంపుకు గురైన బాధితులందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రతీ ఒక్కరిని అదుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, ఒక లీటర్ పామోలీన్, కిలో కందిపప్పు, కిలో బంగాళా దుంపలు అందిస్తామన్నారు. పంట నష్టాలపై అంచనా వేసేందుకు కొన్ని టీమ్స్ వేశామని తెలిపారు. హార్టీ కల్చర్‌లో అరటి, పసుపు, కంద పంటలు సుమారు 4862 హెక్టర్లలో నీట మునిగాయన్నారు. దీంతోపాటు అగ్రికల్చర్లో 33 శాతంపైన నష్టం వాటిల్లిన పంటలకు పరిహారం చెల్లించేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. గత పదేళ్ల తర్వాత వారం రోజుల పాటు వరదలు రావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. కాగా విపత్తుల సమయంలో చెల్లించాల్సిన నష్టాలపై అధ్యయనం చేస్తుమన్నారు. అదేవిధంగా బాధితులను అన్ని విధాల ఆదుకుంటామమన్నారు. -
సరుకులు సరే...నీళ్లు ఎలా..?
ప్రతినెలా సంక్రాంతి కానుక ఇస్తేనే నిరుపేదలకు న్యాయం సరుకుల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ మదనపల్లె: కరువుసీమలోని ప్రజలకు ప్రతినెలా సంక్రాంతి కానుక రూపంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక 8వ చౌకదుకాణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి కానుక రూపంలో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. సంక్రాంతి కానుక అంటూ నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు కానీ వాటిని వండుకుని తినడానికి తాగునీటిని కూడా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నీటి సమస్య కూడా పరిష్కరిస్తేనే ప్రజలకు నిజమైన పండుగన్నారు. గామాల్లో రైతులు రుణాలు మాఫీ జరగకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి పండుగ జరుపుకునే ఉత్సాహంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఆశలతో రుణమాఫీ జరుగుతుందని కలలుగన్న రైత్యాంగానికి ఈ సంక్రాంతి నిరాశే మిగిల్చిందన్నారు. పేద ప్రజలకు, రైతులకు ప్రభుత్వం బాసటగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే వారందరికీ నిజమైన సంక్రాంతని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి కానుక సరుకులను ఎమ్మెల్యే, చైర్మన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, కమిషనర్ రాంబాబు, తహశీల్దార్ శివరామిరెడ్డి, సీఎస్‌డీటీ అమరనాథ్, కౌన్సిలర్లు బాబునాయుడు, మస్తాన్‌రెడ్డి, బండి ఆంజినేయులు, బండి నాగరాజు, నాయకులు కోటూరి ఈశ్వర్, ఆంజి, నూర్, పూజారి రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.