
చేతన్ భరద్వాజ్
‘‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా పాటలు విన్న నాగార్జునగారు ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడమే కాదు, ఏకంగా తాను నటిస్తున్న ఓ సినిమాకు నన్ను సంగీత దర్శకునిగా తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను’’ అని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అన్నారు. తక్కువ కాలంలోనే పలు హిట్ సినిమాలకి, స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించే స్థాయికి చేరుకున్న చైతన్య పుట్టినరోజు బుధవారం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సంగీతంపై ఇష్టంతో సాఫ్ట్‌వేర్ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. శ్రేయాస్ మీడియా వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా నా మ్యూజికల్ టాలెంట్ ఇండస్ట్రీకి తెలిసింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన డైరెక్టర్ రమేశ్ వర్మ ‘7’ అనే సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా వర్క్స్‌లో ఉండగానే ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి నుంచి పిలుపు వచ్చింది.
అయితే ‘7’ సినిమా కంటే ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రమే ముందుగా విడుదలయింది. ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు అందరూ ఛాలెజింగ్ వర్క్స్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఆ సినిమాలాంటి పాటలు కావాలని అడగలేదు.. దీంతో కొత్త ట్యూ¯Œ ్స చేసే వీలు కుదిరింది. నాకు అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు, నా పాటల్ని ఆదిరిస్తున్న శ్రోతలకి ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ శ్రోతలకి మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment