ఈసారి బర్త్‌డేకి అలా కోరుకున్నా! | Shruti Haasan celebrated her birthday on Saturday | Sakshi
Sakshi News home page

ఈసారి బర్త్‌డేకి అలా కోరుకున్నా!

Published Sun, Jan 29 2023 4:10 AM | Last Updated on Sun, Jan 29 2023 4:10 AM

Shruti Haasan celebrated her birthday on Saturday - Sakshi

‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’  అంటున్నారు శ్రుతీహాసన్‌. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో
నిద్ర లేచాను.

ప్రతి ఏడాదీ నా బర్త్‌ డే కేక్‌పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్‌ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది.

అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్‌. కాగా ఈ బర్త్‌ డేని శ్రుతీహాసన్‌ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్‌లతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ శంతను హజారికా, బాలీవుడ్‌ నటి కాజోల్‌ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే  ఇంగ్లిష్‌ ఫిల్మ్‌లో శ్రుతి ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement