Santanu Hazarika Comments On Breakup With Shruti Haasan, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

శ్రుతి హాసన్‌తో బ్రేకప్‌.. సారీ అంటూ క్లారిటీ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్‌

Published Mon, Apr 29 2024 3:52 PM | Last Updated on Mon, Apr 29 2024 4:23 PM

Santanu Hazarika Comments On Breakup With Shruti Haasan

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్పినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతాను హజారికా రియాక్ట్‌ అయ్యాడు. గత కొద్దిరోజులుగా జంట డేటింగ్‌లో ఉన్నారు. కానీ, శృతి, శాంతాను ఇద్దరూ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు. దీంతో వీళ్ల బ్రేకప్‌ వార్తలు బయటకొచ్చాయి.

ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ 'శాంతాను హజారికా'తో  శ్రుతి హాసన్‌ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె కొంత కాలం క్రితం క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రేకప్‌ వార్తలు వైరల్‌ అయిన తర్వాత  శ్రుతి హాసన్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ అయితే రాలేదు.

కానీ, శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్లో రియాక్ట్‌ అయ్యాడు. "నన్ను క్షమించండి, నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు" అని శాంతను బాంబే టైమ్స్‌తో అన్నాడు. వారిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. "వ్యక్తిగత విభేదాలు ఉన్నందున, వారు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు" అని అంతర్గత వ్యక్తి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది.

శ్రుతి విడిపోవడం గురించి రియాక్ట్‌ కాలేదు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో "ఇది ఒక క్రేజీ రైడ్.., నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను" అని షేర్‌ చేసింది. ఆపై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న పోటోలు, పోస్ట్‌లను కూడా ఆమె తొలగించింది. శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడింది శృతి.. అతడి కొంతకాలం డేటింగ్‌ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఈ లవ్‌ స్టోరీకి కూడా ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement