ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్‌మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.
తాజాగా పాక్ పోలీసులు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు.
సీరియస్‌గా మారిన సిల్లీ పోస్ట్!
పాక్ న్యూస్ వెబ్‌సైట్ ‘ఆజ్ ఇంగ్లీష్’లోని ఒక కథనం ప్రకారం ముహమ్మద్ గులాబ్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా అనే ఒక బ్రిటీష్ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్‌జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్‌గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.
కేసు నమోదు.. అరెస్టు!
అనంతరం పోలీసులు ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్ మార్గం గుండా అక్రమంగా భారత్‌లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్‌కు చెందిన అంజూ తన ఫేస్‌బుక్ ప్రెండ్ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..
Comments
Please login to add a commentAdd a comment