![Anasuya Clarity On Crying Video In Instagram About Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/WhatsApp%20Image%202023-08-19%20at%2019.17.13.jpeg.webp?itok=ZX-k1OpP)
యాంకర్ అనసూయ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై, వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ సందడి చేస్తూ ఉంటోంది. చాలాసార్లు అనసూయ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేస్థాయిలో వాటికి అనసూయ కూడా తనదైన స్టెల్‌లో సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అనసూయ ఏడుస్తూ చేసిన ఆ వీడియోను చూసి అభిమానులంతా ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
(ఇది చదవండి: ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్)
అందరూ అనుకుంటున్నట్లు నేను సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఆ వీడియో చేయలేదని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అసలు ఆ పోస్ట్‌ను మీరు చదవలేదా? అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో చేసిన తర్వాత హ్యాపీగా సెలూన్‌కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నానని తెలిపింది. నా లైఫ్‌లో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను సోషల్ మీడియాలో నెగెటివిటీకి భయపడనని పేర్కొంది. దానివల్ల నాకు ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. నాకు సింపతి అనేది అసలు నచ్చదు.. నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యే మనిషిని కాదంటూ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఏడ్చే అలవాటు తనకు లేదని.. ఆ విషయమైతే కోపంతోనే సమాధానం చెబుతానని బదులిచ్చింది.
దీంతో ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా నువ్వు.. నీ ఓవర్ యాక్టింగ్ అంటూ విమర్శిస్తున్నారు. మీ తప్పు లేదు.. మీ వీడియోలు చూస్తున్న మాదే తప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు. అనసూయ వీడియో చూసి కొందరు నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(ఇది చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా? )
Comments
Please login to add a commentAdd a comment