Negative Feelings
-
మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ
యాంకర్ అనసూయ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై, వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ సందడి చేస్తూ ఉంటోంది. చాలాసార్లు అనసూయ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేస్థాయిలో వాటికి అనసూయ కూడా తనదైన స్టెల్లో సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అనసూయ ఏడుస్తూ చేసిన ఆ వీడియోను చూసి అభిమానులంతా ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్) అందరూ అనుకుంటున్నట్లు నేను సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఆ వీడియో చేయలేదని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అసలు ఆ పోస్ట్‌ను మీరు చదవలేదా? అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో చేసిన తర్వాత హ్యాపీగా సెలూన్‌కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నానని తెలిపింది. నా లైఫ్‌లో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను సోషల్ మీడియాలో నెగెటివిటీకి భయపడనని పేర్కొంది. దానివల్ల నాకు ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. నాకు సింపతి అనేది అసలు నచ్చదు.. నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యే మనిషిని కాదంటూ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఏడ్చే అలవాటు తనకు లేదని.. ఆ విషయమైతే కోపంతోనే సమాధానం చెబుతానని బదులిచ్చింది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా నువ్వు.. నీ ఓవర్ యాక్టింగ్ అంటూ విమర్శిస్తున్నారు. మీ తప్పు లేదు.. మీ వీడియోలు చూస్తున్న మాదే తప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు. అనసూయ వీడియో చూసి కొందరు నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా? ) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్‌మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు. తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్‌తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్‌లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!) -
భారతీయుల సంతోషాన్ని లాకున్న కోవిడ్.. సర్వేలో కీలక విషయాలు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి భారతీయుల భావోద్వేగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళనలతో ఇటీవల కాలంలో నిరాశ, నిస్పృహలను పెంచుతోంది. ఫలితంగా కోవిడ్ సోకిన భారతీయుల్లో సంతోషాల శాతం క్షీణిస్తోంది. కన్సల్టింగ్ సంస్థ హ్యాపీప్లస్ ‘ది స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ 2023’ నివేదిక ప్రకారం.. 35 శాతం మంది ‘నెగిటివ్ ఎమోషన్స్’ అనుభవిస్తున్నారు. ఇది గత సర్వేతో పోలిస్తే రెండుశాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు భారతీయుల్లో సానుకూల భావోద్వేగాలు 70 నుంచి 67 శాతానికి పడిపోయాయి. జీవన మూల్యాంకన రేటు 6.84 పాయింట్ల నుంచి 6.08 పాయింట్లకు తగ్గిపోయింది. ఆర్థిక సమస్యలు, పనిప్రదేశాల్లో ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనం, కుటుంబంలో అనిశ్చి తులు వంటి కారణాలు అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని సర్వే అభిప్రాయపడింది. యువత, వృద్ధుల్లో పెరుగుతున్న కోపం హ్యాపిప్లస్ దేశవ్యాప్తంగా 14 వేల మంది ప్రతిస్పందనల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఇందులో విద్యార్థుల్లో అత్యధికంగా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 18 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇతర వయసుల వారి కంటే ఎక్కువగా కోపం, విచారం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పదిమందికి ఇద్దరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటే.. ఇప్పుడు వారిసంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం. తగ్గిన జీవన వృద్ధి మరోవైపు తాజా అధ్యయనంలో 20 శాతం మంది వివిధ కారణాలతో బాధపడుతున్నట్టు తేలిందని నివేదిక చెబుతోంది. ఇది 2021లో 12 శాతంగా ఉండేది. అలాగే నిత్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు 63 శాతం ఉండగా.. ఇది కూడా గతేడాది కంటే (49 శాతం) పెరిగింది. ఇదిలా ఉంటే గతేడాది 39 శాతం మంది భారతీయులు తాము వృద్ధి సాధించామని చెబితే.. ఇప్పుడు 17 శాతం మంది మాత్రమే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. -
Negative Thoughts: గత అనుభవాలు, నెగెటివ్ ఆలోచనలు వెంటాడుతున్నాయా?
గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన కోరిక, తపన మనకు ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, అసలు ఆలోచించక పోవడం రెండూ తప్పే. భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అనే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. చదవండి: కాలేయాన్ని కాపాడుకోవాలంటే...ఏం చేయాలి? ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం లేదో ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మన మీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ► చివరగా ఒక మాట.. నెగెటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముట్టకూడదంటే ముందు మనల్ని మనం అన్ కండిషనల్‌గా ప్రేమించుకోవాలి. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
ఎక్కడిదక్కడ మరిచిపోవడమే ఆరోగ్యానికి మేలు!
మనల్ని ఇబ్బందిపెట్టే అంశాలు, చెడు అనుభవాలు మనసులో ఉంటే కుదురుగా ఉండలేము సరికదా.. ఆరోగ్యమూ పాడవుతుంది. అందుకే యోగ సాధనలో గురువులు తరచూ ‘మీలోని నెగెటివ్ ఫీలింగ్స్‌ను మరచిపోండి.. వాటిని వదిలేయండి’ అని చెబుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రకంగా నెగెటివ్ ఫీలింగ్స్‌ను మరచిపోవడమన్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దాదాపు వెయ్యిమంది మధ్య వయస్కులపై జార్జ్ మేసన్ యూనివర్సిటీ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై ఒక అధ్యయనం చేశారు. రోజువారీ ఒత్తిళ్లను, నెగెటివ్ ఫీలింగ్స్‌ను అధిగమించలేని వారు పదేళ్ల తరువాత కూడా తీవ్రమైన భౌతిక సమస్యలకు గురవుతారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఒత్తిళ్లకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా కొంతకాలానికి వాటి ప్రభావం మన శరీరాలపై పడుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ మాడాక్స్ తెలిపారు. రోజూ ఏ రకమైన పనులు చేస్తున్నారు? అందులో ఒత్తిడికి గురి చేసే అంశాలేవి? వాటికి మీరెలా స్పందిస్తారు? ఎంతకాలం ఆ భావనలతో గడుపుతారు? వంటి అనేక అంశాలపై సమాధానాలు రాబట్టడం ద్వారా తాము ఈ అధ్యయనం చేశామని పదేళ్ల తరువాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా మానసిక ఒత్తిడి, నెగెటివ్ ఫీలింగ్స్ తాలూకు ప్రభావాన్ని అంచనా వేశామని జేమ్స్ వివరించారు. -
పాజిటివ్ థాట్స్
‘సానుకూలంగా ఆలోచించేవారన్నా, అటువంటి పరిసరాలైనా నాకు ఇష్టం. నెగిటివిటీని, నెగిటివ్ ఫీలింగ్స్‌ని, అవి పెంపొందించే వ్యక్తులను నేను దూరంగా ఉంచుతా’ అని చెప్పారు సిటీ సోషలైట్ పింకిరెడ్డి. సోమాజిగూడ ల్యాండ్‌మార్క్ బుక్‌స్టోర్‌లో సినీనటి, కాలమిస్ట్ అనూహసన్ రాసిన ‘సన్నీ సైడ్ అప్’ పుస్తకాన్ని ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పింకిరెడ్డి మాట్లాడుతూ... పుస్తకం పాజిటివ్ యాట్యిట్యూడ్ని పెంపొందించే విధంగా ఉందన్నారు. తాను చిన్నతనంలో రాయాలని ప్రయత్నించి విఫలమయ్యానని... అందుకే రచయితలంటే ఎంతో అభిమానమన్నారు. ఈ సందర్భంగా పుస్తకంలో తనకు నచ్చిన కొన్ని పంక్తులను ఆమె చదివి వినిపించారు. రచయిత్రి అనుహసన్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా విభిన్న మేగ్జైన్లు, పత్రికలకు రాస్తున్నానన్నారు. అయితే కొంత కాలంగా ఓ పుస్తకం రాయమని సన్నిహితులు అడగడం, పరిస్థితులు పురిగొల్పడంతో ‘సన్నీ సైడ్ అప్’ అక్షర రూపం దాల్చుకుందన్నారు.