పాజిటివ్ థాట్స్ | Positive Thoughts | Sakshi
Sakshi News home page

పాజిటివ్ థాట్స్

Published Thu, Jan 22 2015 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

పాజిటివ్ థాట్స్

పాజిటివ్ థాట్స్

‘సానుకూలంగా ఆలోచించేవారన్నా, అటువంటి పరిసరాలైనా నాకు ఇష్టం. నెగిటివిటీని, నెగిటివ్ ఫీలింగ్స్‌ని, అవి పెంపొందించే వ్యక్తులను నేను దూరంగా ఉంచుతా’ అని చెప్పారు సిటీ సోషలైట్ పింకిరెడ్డి. సోమాజిగూడ ల్యాండ్‌మార్క్ బుక్‌స్టోర్‌లో సినీనటి, కాలమిస్ట్ అనూహసన్ రాసిన ‘సన్నీ సైడ్ అప్’ పుస్తకాన్ని ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పింకిరెడ్డి మాట్లాడుతూ... పుస్తకం పాజిటివ్ యాట్యిట్యూడ్‌ని పెంపొందించే విధంగా ఉందన్నారు.

తాను చిన్నతనంలో రాయాలని ప్రయత్నించి విఫలమయ్యానని... అందుకే రచయితలంటే ఎంతో అభిమానమన్నారు. ఈ సందర్భంగా పుస్తకంలో తనకు నచ్చిన కొన్ని పంక్తులను ఆమె చదివి వినిపించారు. రచయిత్రి అనుహసన్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా విభిన్న మేగ్‌జైన్లు, పత్రికలకు రాస్తున్నానన్నారు. అయితే కొంత కాలంగా ఓ పుస్తకం రాయమని సన్నిహితులు అడగడం, పరిస్థితులు పురిగొల్పడంతో ‘సన్నీ సైడ్ అప్’ అక్షర రూపం దాల్చుకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement